ఆడపిల్ల నగ్న వీడియో తీసిన వ్యక్తికి బాబు అభయం

బాలికను బ్లాక్‌ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి మాజీ సీఎం చంద్రబాబునాయుడిని కలవడం, అతడికి చంద్రబాబు అండగా ఉంటామని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనబాకంకు చెందిన బాలికను జగపతి అనే వ్యక్తి ఇటీవల బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేశాడు.

బాలిక స్నానం చేస్తున్న సమయంలో రహస్యంగా ఆమె ఫోటోలు, వీడియోలను చిత్రీకరించి వాటి సాయంతో బాలికను లొంగదీసుకున్నాడు. ఆ వీడియోలను తన ముగ్గురు స్నేహితులకు కూడా పంపించాడు. తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలంటూ బాలికను బెదిరించాడు.

దాంతో అమ్మాయి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు జగపతిపై నిర్భయ కేసు నమోదు చేశారు.

దీన్ని కూడా వైసీపీ ప్రభుత్వ వేధింపుల కింద చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును కలిసిన జగపతి తనకు అండగా ఉండాలని కోరారు. అందుకు చంద్రబాబు కూడా అభయం ఇచ్చారు. ఈ పరిణామంపై బాధితురాలి కుటుంబసభ్యులు మండిపడ్డారు. జగపతిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని చంద్రబాబు ఆక్షేపించారు.

చంద్రబాబు కుటుంబంలోని ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి అత్యాచారాలు చేసిన వ్యక్తికి మద్దతు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.