Telugu Global
NEWS

ఏటీపీ టూర్ ఫైనల్స్ పోరుకు కౌంట్ డౌన్

నవంబర్ 10 నుంచి టాప్-10 ర్యాంకర్ల సమరం ఒకే గ్రూపులో ఫెదరర్, జోకోవిచ్ ప్రపంచ టెన్నిస్ లో అత్యధిక భారీ ప్రైజ్ మనీ కలిగిన టోర్నీ…ఏటీపీ టూర్ ఫైనల్స్ -2019 కు లండన్ నగరంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. పురుషుల టెన్నిస్ లో మొదటి ఎనిమిది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్లు…టైటిల్ కోసం రెండుగ్రూపులుగా ఢీ కొనబోతున్నారు. ఆరుసార్లు టూర్ ఫైనల్స్ విన్నర్ రోజర్ ఫెదరర్, ఐదుసార్లు విజేత నొవాక్ జోకోవిచ్ …ఒకే గ్రూపులో తలపడబోతున్నారు. మొత్తం పదిమంది […]

ఏటీపీ టూర్ ఫైనల్స్ పోరుకు కౌంట్ డౌన్
X
  • నవంబర్ 10 నుంచి టాప్-10 ర్యాంకర్ల సమరం
  • ఒకే గ్రూపులో ఫెదరర్, జోకోవిచ్

ప్రపంచ టెన్నిస్ లో అత్యధిక భారీ ప్రైజ్ మనీ కలిగిన టోర్నీ…ఏటీపీ టూర్ ఫైనల్స్ -2019 కు లండన్ నగరంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

పురుషుల టెన్నిస్ లో మొదటి ఎనిమిది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్లు…టైటిల్ కోసం రెండుగ్రూపులుగా ఢీ కొనబోతున్నారు.
ఆరుసార్లు టూర్ ఫైనల్స్ విన్నర్ రోజర్ ఫెదరర్, ఐదుసార్లు విజేత నొవాక్ జోకోవిచ్ …ఒకే గ్రూపులో తలపడబోతున్నారు.
మొత్తం పదిమంది ప్లేయర్లను జోర్న్ బోర్గ్, ఆండ్రీ అగాసీ పేర్లతో విభజించిన గ్రూపుల్లో చేర్చారు.

బోర్గ్ గ్రూపులో నొవాక్ జోకోవిచ్, రోజర్ ఫెదరర్, డోమనిక్ థైమ్, మోటియా బెరిటినీ తలపడనున్నారు. అగాసీ గ్రూపులో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు రాఫెల్ నడాల్, డిఫెండింగ్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరేవ్,స్టెఫానోస్ సిటిస్ పాస్, డేనిల్ మెద్వదేవ్ ఉన్నారు.

2011లో చివరిసారిగా ఏటీపీ టూర్ విన్నర్ గా ఫెదరర్ నిలిస్తే…ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నడాల్ ఒక్కసారీ విజేతగా నిలువలేకపోడం విశేషం.

గ్రూపు రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో సాగే ఈ టోర్నీలో… గ్రూపులో మొదటి రెండుస్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు సెమీఫైనల్స్ లో తలపడతారు. నవంబర్ 10 నుంచి 17 వరకూ ఈ మెగా టోర్నీ జరుగనుంది.

First Published:  8 Nov 2019 12:05 AM GMT
Next Story