అమ్మాయిలపై మహిళ అత్యాచారం…. ప్రియుడి ఆత్మహత్య

ఒంగోలులో ఒక మహిళ సాగించిన వికృత చేష్టల అంశం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలను ట్రాప్ చేసి వారిపై అత్యాచారం చేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా కొండేపి మండలానికి చెందిన సుమలత భర్త నుంచి విడిపోయి… కొన్నేళ్లుగా ఒంగోలులో ఉంటోంది. ఏడుకొండలు అనే ఆటో డ్రైవర్‌తో సహజీవనం చేస్తోంది.

ఈమె వికృత శృంగార చర్యలకు అలవాటు పడింది. సిమ్ కార్డులు విక్రయించే వంశీ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని… సిమ్‌ కార్డుల కోసం వచ్చే అమ్మాయిల ఫోన్ నెంబర్లను సేకరించింది. ఆ నెంబర్లకు సంబంధించిన అమ్మాయిలతో మగవాడిగా చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. మగ గొంతుతో మాట్లాడేది. తన పేరు సాయితేజగా చెప్పుకునేది. అలా అమ్మాయిలను ట్రాప్ చేసి ఇంటికి పిలిపించుకుని అక్కడికి వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసేది.

ఇటీవల ఒక ఇంటర్ అమ్మాయిని కూడా ఇలాగే ట్రాప్ చేసింది సుమలత. అమ్మాయికి మత్తుమందు ఇచ్చి వికృతంగా లైంగిక దాడి చేసింది. మత్తు నుంచి తేరుకున్న ఆ అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై సుమలతతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా లైంగిక దాడి చేసినట్టు వివరించింది. దీంతో సుమలత ఇంటికి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇంటిలో తనిఖీలు చేయగా… సెక్స్ టాయ్స్‌ బయటపడ్డాయి. ఇలా తమ గుట్టు బయటపడడంతో అవమానంగా ఫీల్‌ అయిన ఆమె ప్రియుడు ఏడుకొండలు… పోలీసులు అక్కడ ఉండగానే మేడపైకి వెళ్లి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఏడు కొండలును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు సుమలతతో పాటు ఆమెకు సహకరించిన సిమ్‌ ల విక్రయదారుడు వంశీని అరెస్ట్ చేశారు.