సోనియా, రాహుల్‌కు ఎస్‌పీజీ భద్రత తొలగింపు

కేంద్ర ప్రభుత్వం గాంధీ ఫ్యామిలీకి మరో షాక్ ఇచ్చింది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌-ఎస్‌పీజీ భద్రతను ఎత్తివేసింది.

కొద్ది రోజుల క్రితమే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు కూడా ఎస్‌పీజీ భద్రతను తొలగించి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పిస్తోంది. ఇప్పుడు గాంధీ ఫ్యామిలీకి కూడా ఎస్‌పీజీని తొలగించింది. ఇకపై గాంధీ కుటుంబసభ్యులకు సీఆర్‌పీఎఫ్‌ ద్వారా జెడ్‌ ప్లస్ కేటగిరిలో భద్రతను కల్పించనున్నారు.

గాంధీ ఫ్యామిలీకి వచ్చిన ముప్పేమీ లేదన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. దేశంలో ప్రధాని, ఆయన కుటుంబ సభ్యులకు, మాజీ ప్రధానులు, వారి కుటుంబసభ్యులకు ఎస్‌పీజీ భద్రతను కల్పిస్తుండేవారు. కానీ మోడీ సర్కార్‌ వచ్చిన తర్వాత తొలుత మన్మోహన్ సింగ్‌కు ఎస్‌పీజీ భద్రత తొలగించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధినేత్రి కుటుంబానికి భద్రతను కుదించారు.