Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు శ్రీరెడ్డికి ఒక అవకాశం

టాలీవుడ్ లో శ్రీరెడ్డి ఓ సంచలనం. ఏకంగా ఫిలింఛాంబర్ ముందు అర్థనగ్నంగా కూర్చున్న చరిత్ర ఆమెది. అయితే ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు మా అసోసియేషన్ లో సభ్యత్వం ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే దాదాపు టాలీవుడ్ అంతా ఆమెను వెలి వేసింది. దీంతో చేసేదేం లేక ఆమె చెన్నై వెళ్ళిపోయింది. అక్కడే అవకాశాల కోసం ప్రయత్నించుకుంటూ.. ఎలాగోలా ఓ 2 సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. అలా కెరీర్ ను నెట్టుకొస్తున్న శ్రీరెడ్డికి ఎట్టకేలకు టాలీవుడ్ […]

ఎట్టకేలకు శ్రీరెడ్డికి ఒక అవకాశం
X

టాలీవుడ్ లో శ్రీరెడ్డి ఓ సంచలనం. ఏకంగా ఫిలింఛాంబర్ ముందు అర్థనగ్నంగా కూర్చున్న చరిత్ర ఆమెది. అయితే ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు మా అసోసియేషన్ లో సభ్యత్వం ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే దాదాపు టాలీవుడ్ అంతా ఆమెను వెలి వేసింది.

దీంతో చేసేదేం లేక ఆమె చెన్నై వెళ్ళిపోయింది. అక్కడే అవకాశాల కోసం ప్రయత్నించుకుంటూ.. ఎలాగోలా ఓ 2 సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది.

అలా కెరీర్ ను నెట్టుకొస్తున్న శ్రీరెడ్డికి ఎట్టకేలకు టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. క్లైమాక్స్ అనే సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది శ్రీరెడ్డి. భవానీ శంకర్ దర్శకత్వంలో క్లైమాక్స్ అనే సినిమా చేస్తున్నట్టు ఈ మేరకు శ్రీరెడ్డి ప్రకటించింది. అంతేకాదు.. ఈ సినిమాలో ఆమె ఓ వివాదాస్పద హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఆ వివాదాస్పద హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

సినిమా సంగతి పక్కనపెడితే, మొత్తానికి శ్రీరెడ్డికి తెలుగులో ఓ అవకాశమైతే వచ్చింది. అయితే ఇక్కడో విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సరిగ్గా 2 రోజుల కిందట మెగాస్టార్ చిరంజీవిపై విరుచుకుపడింది శ్రీరెడ్డి. ఫేస్ బుక్ లో వరుసపెట్టి వీడియోలు రిలీజ్ చేసింది. అది జరిగిన కొన్ని రోజులకే ఆమెకు తెలుగు సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందంటూ పుకార్లు వస్తున్నాయి.

First Published:  8 Nov 2019 5:19 AM GMT
Next Story