హాయ్‌ ల్యాండ్‌ కొట్టేసే ప్లాన్ నిజం కాదా ? బాబూ…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఒక పెద్ద మోసగాడు అని అభివర్ణించారు. అగ్రిగోల్డ్ స్కాం చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందన్నారు.

హాయ్‌ ల్యాండ్‌ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, నారా లోకేష్ ప్లాన్ చేశారన్నారు. చంద్రబాబు పెద్ద మాయల ఫకీర్ అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క అగ్రిగోల్డ్ బాధితుడికైనా డబ్బు చెల్లించారా అని ప్రశ్నించారు.

హాయ్ ల్యాండ్ భూములను తన కుమారుడు నారా లోకేష్‌కు రాసివ్వాల్సిందిగా చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని… తెర వెనుక చంద్రబాబు ఉంటే తెర ముందు లోకేష్‌, సీఎం రమేష్, యనమల ఉండి కథ నడిపారన్నారు.

హాయ్‌ ల్యాండ్ భూములు కొట్టేసేందుకు ప్రయత్నించింది నిజం కాదు అని చంద్రబాబు చెప్పగలరా అని తమ్మినేని సవాల్ చేశారు. చంద్రబాబు ఒకవేళ అలా చెబితే బట్టలూడదీసి జనం ముందు నిలబెడతామన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చిన హామీలు, మోసాలు పెద్ద పుస్తకం అవుతాయన్నారు.