టిక్ టాక్ వీడియోలు…. భార్యను చంపిన భర్త

టిక్ టాక్ .. ఇప్పుడు ఇది వ్యసనంగా మారిపోయింది. కొందరు అదే పనిగా దీంట్లో వీడియోలు తీస్తూ షేర్ చేస్తూ ఆ లోకంలోనే మునిగిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి భార్య కూడా ఈ టిక్ టాక్ మోజులో పడి అసువులు బాసింది. తాజాగా భార్య తరచూ టిక్ టాక్ వీడియోలు పోస్టు చేస్తుందనే కారణంతో ఆమె భర్త అతి కిరాతకంగా హత్య చేసిన వైనం ఏపీలోని ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది.

ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని తాళ్ళూరు ప్రాంతానికి చెందిన మహిళ ఫాతిమా(30) కొంత కాలం క్రితం ఓ టైలర్ ను వివాహం చేసుకుంది. అనంతరం ఫాతిమా టిక్ టాక్ లో మునిగిపోయింది. తరచూ వీడియోలు తీస్తూ పోస్టు చేస్తూ హల్ చల్ చేసింది. ఆమె వీడియోలు చూసిన భర్తకు కోపం కట్టలు తెంచుకుంది. వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించినా భార్య మారకపోవడంతో గొడవ మొదలైంది.

భార్య టిక్ టాక్ చేస్తూ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త చపాతి కర్రతో ఫాతిమా తలమీద కొట్టి చంపే శాడు. అనంతరం ఆమెను ఉరితాడుకి వేలాడదీసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించాడు. అయితే రక్తపు మరకలు చూసి అనుమానపడ్డ పోలీసులు భర్తను విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.

ఇలా టిక్ టాక్ పిచ్చి ఓ మహిళ ప్రాణం తీసింది. అదే పనిగా అందులో మునిగితేలడంతో ఆ భర్త కడతేర్చాడు.