దేవాన్ష్‌ ఏ మీడియం బాబు?… మాలోకానికి పాత వీడియోలు చూపించండి

ఏపీ ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నారా లోకేష్ వ్యతిరేకించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం అంటూ సవాల్ చేశారు.

స్కూళ్లలో చైనీస్, జపనీస్‌ నేర్పించాలంటూ చంద్రబాబు చేసిన ప్రసంగాలకు సంబంధించిన పాత వీడియోను లోకేష్‌కు చూపించి జ్ఞానం ప్రసాదించండి అని సూచించారు.

”మీ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు… పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి…ఉన్నత స్థితికి వెళ్లకూడదా” అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడంపై చంద్రబాబు, నారా లోకేష్‌లు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.