ఏడు చేపల కథ మొదటి రోజు వసూళ్లు

పూర్తిస్థాయి అడల్ట్ కంటెంట్ తో వచ్చిన ఏడు చేపల కథ సినిమాకు మొదటి రోజు కుర్రాళ్లు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని బి, సి సెంటర్లలో ఈ సినిమాకు హౌజ్ ఫుల్ షోలు నడిచాయి. అటు విశాఖపట్నం లాంటి సిటీల్లో కూడా పెద్ద థియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి. అలా టార్గెట్ ఆడియన్స్ కు రీచ్ అయిన ఈ సినిమా, మొదటి రోజు కోటి 6 లక్షల రూపాయల షేర్ రాబట్టడం విశేషం.

కేవలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసమే ఈ సినిమా తీశామని యూనిట్ బాహాటంగా ప్రకటించుకుంది. మహిళలు, కుటుంబాలు ఈ సినిమాకు వెళ్లొద్దని ఓపెన్ గా ప్రచారం చేసింది. కుర్రాళ్లు మాత్రం మిస్ అవ్వొద్దని ఊరించింది. చెప్పినట్టుగానే సినిమాలో 6-7 సన్నివేశాలు బాగా పేలాయి. తెలుగులో వచ్చిన అడల్ట్ సినిమాల్లో ఇది పీక్ అని చెప్పొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 38 లక్షలు
సీడెడ్ – 21 లక్షలు
ఉత్తరాంధ్ర – 13 లక్షలు
ఈస్ట్ – 8 లక్షలు
వెస్ట్ – ఆరున్నర లక్షలు
గుంటూరు – 7 లక్షలు
నెల్లూరు – 5 లక్షలు
కృష్ణా – 7.4 లక్షలు