Telugu Global
NEWS

టీ-20 చేజింగ్ లో భారత్ ప్రపంచ రికార్డు

ఆస్ట్ర్రేలియా రికార్డును అధిగమించిన భారత్ ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల విజయం సాధించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొంది. చేజింగ్ లో తనకుతానే సాటిగా నిలిచింది. చేజింగ్ లో ఇప్పటి వరకూ ఆస్ట్ర్రేలియా పేరుతో ఉన్న 40 చేజింగ్ విజయాలను భారత్ 41 విజయాలతో […]

టీ-20 చేజింగ్ లో భారత్ ప్రపంచ రికార్డు
X
  • ఆస్ట్ర్రేలియా రికార్డును అధిగమించిన భారత్

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల విజయం సాధించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొంది. చేజింగ్ లో తనకుతానే సాటిగా నిలిచింది.

చేజింగ్ లో ఇప్పటి వరకూ ఆస్ట్ర్రేలియా పేరుతో ఉన్న 40 చేజింగ్ విజయాలను భారత్ 41 విజయాలతో తెరమరుగు చేసింది. రాజ్ కోట మ్యాచ్ వరకూ భారత్ ఆడిన 61 చేజింగ్ ల్లో 41 విజయాలతో 67.21 సక్సెస్ రేటును సాధించింది.

ఆస్ట్ర్రేలియా మొత్తం 69 మ్యాచ్ ల్లో చేజింగ్ కు దిగి 40 విజయాలు సాధించడం ద్వారా…57.97 విజయశాతం నమోదు చేసింది.

67 సార్లు చేజింగ్ కు దిగిన పాక్ జట్టు 36 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

100 మ్యాచ్ ల రెండో క్రికెటర్ రోహిత్…

టీ-20 క్రికెట్లో వంద మ్యాచ్ లు ఆడిన రెండో క్రికెటర్ గా రోహిత్ శర్మ చేరాడు. రాజ్ కోట మ్యాచ్ తో టీ-20 మ్యాచ్ ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్..85 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం సొంతం చేసుకోగలిగాడు.

అత్యధికంగా 111 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేరుతో ఉంది. షాహీద్ ఆఫ్రిదీ 99, మహేంద్ర సింగ్ ధోనీ 98, రోజ్ టేలర్ 93 మ్యాచ్ లతో ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు.

First Published:  8 Nov 2019 10:58 PM GMT
Next Story