వైసీపీ పై పవన్ కామెంట్స్… చిరు ఎంట్రీతో సైలెంట్ అయ్యాడా?

పవన్ – జగన్ ల మధ్య నడిచిన మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడడానికి కారణం చిరంజీవి అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

మొన్నటి విశాఖ లాంగ్ మార్చ్ లో ఏపీ సీఎం జగన్ ను వ్యక్తిగతంగా, ఆయన ప్రభుత్వంపై దారుణమైన విమర్శలు చేశాడు పవన్. ఇవి దుమారం రేపాయి.

దీనికి కౌంటర్ గా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా పవన్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. చిరంజీవి ప్రోద్బలంతో సినిమాల్లో నిలదొక్కుకున్న నీ బండారం బయటపెడుతామంటూ వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ముఖ్యంగా వైసీపీ నేతలు కన్నబాబు, అంబటి రాంబాబు అయితే విరుచుకుపడ్డారు.

జనసేన-వైసీపీ మధ్య పరస్పర మాటల యుద్ధం తారాస్థాయికి చేరడం.. చివరకు మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీకి కూడా ఈ వివాదం తాకడంతో చిరు అలెర్ట్ అయినట్టు సమాచారం.

వెంటనే పవన్ కు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు మాయలో పడిపోయి… మొన్ననే అఖండ ప్రజా బలంతో గెలిచిన జగన్ పై విమర్శలు చేయడం మంచిది కాదని హితబోధ చేసినట్టు తెలుస్తోంది.

ఇక తనకు తెలిసిన వైసీపీ నేత కన్నబాబుతో కూడా చిరంజీవి మాట్లాడినట్లు తెలుస్తోంది.  పవన్ లోని దూకుడు, దుందుడుకు తనం తెలుసుకదా…. అని కన్నబాబుకు చిరు సర్ధి చెప్పినట్టు తెలిసింది.

ఇక పవన్ ను గట్టిగా నిలదీస్తున్న అంబటి రాంబాబుతో కూడా చిరంజీవితో మాట్లాడినట్టు తెలిసింది.

దీంతో తాజాగా పవన్ సైలెంట్ అయిపోయాడు. ఈ విధంగా చిరంజీవి ఎంట్రీతో జనసేన-వైసీపీ మాటల యుద్దానికి ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని అంటున్నారు.