Telugu Global
NEWS

విరాట్ కొహ్లీని మించిన స్మృతి మంథానా

వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 2వేల పరుగులు వన్డే క్రికెట్లో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీకి సాధ్యం కాని రికార్డును…మహిళా క్రికెటర్ స్మృతి మంథానా సాధించింది. అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరిన భారత రెండో క్రికెటర్ గా, ప్రపంచ క్రికెట్లో మూడో మహిళగా భారత ఓపెనర్ స్మృతి మంథానా రికార్డుల్లో చేరింది. ఆంటీగా వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన మూడో వన్డేలో ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన స్మృతి మంధానా 63 బాల్స్ లో […]

విరాట్ కొహ్లీని మించిన స్మృతి మంథానా
X
  • వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 2వేల పరుగులు

వన్డే క్రికెట్లో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీకి సాధ్యం కాని రికార్డును…మహిళా క్రికెటర్ స్మృతి మంథానా సాధించింది. అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరిన భారత రెండో క్రికెటర్ గా, ప్రపంచ క్రికెట్లో మూడో మహిళగా భారత ఓపెనర్ స్మృతి మంథానా రికార్డుల్లో చేరింది.

ఆంటీగా వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన మూడో వన్డేలో ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన స్మృతి మంధానా 63 బాల్స్ లో 74 పరుగులు సాధించడం ద్వారా.. 2వేల పరుగుల మైలురాయిని చేరింది.

భారత క్రికెట్లో శిఖర్ ధావన్ కేవలం 48 ఇన్నింగ్స్ లోనే 2వేల పరుగులు రికార్డు సాధిస్తే…స్మృతి మంథానా మాత్రం 51 ఇన్నింగ్స్ లో కానీ 2వేల పరుగులు సాధించలేకపోయింది.

మహిళా క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 2వేల పరుగులు సాధించిన మొదటి ఇద్దరిలో బెలిండా క్లార్క్, మెగ్ లానింగ్ ఉన్నారు. ఈ ఇద్దరి తర్వాత స్మృతి మంథానా మాత్రమే అత్యంత వేగంగా 2వేల పరుగుల రికార్డు నమోదు చేయగలిగింది.

స్మృతి మొత్తం 51 మ్యాచ్ ల్లో 2025 పరుగులతో 43.08 సగటు సాధించింది. విరాట్ కొహ్లీ 53, సౌరవ్ గంగూలీ 52, నవజోత్ సిద్దూ 52 మ్యాచ్ ల్లోనూ 2వేల పరుగుల మైలురాయిని చేరుకోగలిగారు.

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ హషీమ్ ఆమ్లా కేవలం 40 మ్యాచ్ ల్లోనే 2వేల పరుగులు సాధించిన ప్రపంచ రికార్డును తనపేరుతో లిఖించుకొన్నాడు.

మహిళల విభాగంలో బెలిండా క్లార్క్, మెగ్ లానింగ్ 45 మ్యాచ్ ల్లో 2 వేల పరుగులు సాధించడం ద్వారా సంయుక్త అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

First Published:  8 Nov 2019 11:10 PM GMT
Next Story