Telugu Global
NEWS

రాజీనామా చేసే యోచనలో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి " ఏబీఎన్ రాధాకృష్ణ

అవాస్తవాలతో కథనాలు రాస్తే చర్యలు తప్పవని ఇటీవల ఏపీ ప్రభుత్వం హెచ్చరిస్తూ జీవో కూడా ఇచ్చింది. అయినా మీడియాపై వైసీపీకి పట్టు దొరికే సూచనలు కనిపించడం లేదు. ప్రతివారం తన మీడియాలో వ్యాసం రాసే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ… ఈసారి జగన్‌ప్రభుత్వంపై మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే వారు అనుకుంటున్నారు… వీరు అనుకుంటున్నారు… అంటూ వ్యాసం రాశారు. అందులో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి జనవరి తర్వాత కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగాలని భావిస్తున్నారని… […]

రాజీనామా చేసే యోచనలో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి  ఏబీఎన్ రాధాకృష్ణ
X

అవాస్తవాలతో కథనాలు రాస్తే చర్యలు తప్పవని ఇటీవల ఏపీ ప్రభుత్వం హెచ్చరిస్తూ జీవో కూడా ఇచ్చింది. అయినా మీడియాపై వైసీపీకి పట్టు దొరికే సూచనలు కనిపించడం లేదు.

ప్రతివారం తన మీడియాలో వ్యాసం రాసే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ… ఈసారి జగన్‌ప్రభుత్వంపై మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే వారు అనుకుంటున్నారు… వీరు అనుకుంటున్నారు… అంటూ వ్యాసం రాశారు.

అందులో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి జనవరి తర్వాత కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగాలని భావిస్తున్నారని… ఆ విషయాన్ని సన్నిహితుల వద్ద కూడా చెప్పారని రాధాకృష్ణ వివరించారు. జగన్‌ నిర్ణయాలతో ఆర్థిక శాఖ అధికారులు కూడా సతమతమవుతున్నారని వివరించారు.

ఆర్థిక వ్యవహారాలలో ఇదే ధోరణి కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడినా… ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదని ఒక సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారని వివరించారు.

జగన్ సలహాదారుల మాట కూడా వినడం లేదని రాధాకృష్ణ వివరించారు. ఏదో గుట్టుగా బతుకుతున్నాం… జగన్‌ మా మాట వింటారని అనుకోవద్దు అని…. తమ వద్దకు వచ్చిన వారికి జగన్ సలహాదారులు చెబుతున్నారని…. రాధాకృష్ణ రాశారు.

రాధాకృష్ణ ఎన్ని రాసినా ఏపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు…. ఆ పత్రికను, ఆ మీడియాను ఫాలో కారు కాబట్టి దీనిపై స్పందించే సూచనలు ఉండవు.

First Published:  9 Nov 2019 9:46 PM GMT
Next Story