లుక్ కోసం సన్నబడిన బాలయ్య

రూలర్ సినిమాలో రెండు గెటప్స్ ఉన్నాయి. ఆ రెండు షేడ్స్ కు సంబంధించిన లుక్స్ ను రివీల్ చేశారు. కాకపోతే ఇప్పుడు అందులో ఓ షేడ్ కు సంబంధించి ఆసక్తికరమైన అంశాన్ని బయటపెట్టారు మేకర్స్. ఈ సినిమాలో హెయిర్ స్టయిల్, గడ్డం మార్చి డిఫరెంట్ గా ఉన్న ఓ లుక్ ఉంది. ఆ లుక్ కోసం బాలయ్య అమాంతం 7 కిలోలు తగ్గాడట. ఒక్కసారిగా స్లిమ్ గా మారాడట. ఆ స్లిమ్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.

ఫొటో చూస్తే బాలయ్య స్లిమ్ గా మారాడనే విషయం అర్థమౌతూనే ఉంది. కాకపోతే అది ఫొటోగ్రఫీ జిమ్మిక్కా లేక నిజంగానే బాలయ్య తగ్గాడా అనేది తేలాల్సి ఉంది. `రూల‌ర్‌` షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పుడు మున్నార్‌లో ఓ మెలోడి సాంగ్‌ను బాల‌కృష్ణ‌, వేదిక‌ల‌పై చిత్రీక‌రిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట‌ను రాశారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌మోష‌న్స్ ఇప్ప‌టికే ప్రారంభ‌మైయ్యాయి. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.