Telugu Global
CRIME

పసుపు తాడు పట్టుకోవాల్సిన చేయి.... ఉరితాడు పట్టుకుంది

మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలోని ఓ పంక్షన్‌లో ఆదివారం ఉదయం 11.35 నిమిషాలకు పెళ్లి. 11 గంటలు అవుతోంది. పెళ్లి కుమారుడు ఇంకా రాలేదు. ఉదయం వచ్చిన పెళ్లి కొడుకు రూమ్‌లోకి వెళ్లి డోర్‌ వేసుకున్నాడు. బయటకు లేదు. డోర్‌ కొట్టి పిలిచారు. అయినా బయటకు రాలేదు. దీంతో మరో తాళం పెట్టి తెరిచి చూస్తే… అందరూ ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపట్లో తాళి కట్టి పెళ్లిచేసుకోవాల్సిన వరుడు… […]

పసుపు తాడు పట్టుకోవాల్సిన చేయి.... ఉరితాడు పట్టుకుంది
X

మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలోని ఓ పంక్షన్‌లో ఆదివారం ఉదయం 11.35 నిమిషాలకు పెళ్లి. 11 గంటలు అవుతోంది. పెళ్లి కుమారుడు ఇంకా రాలేదు. ఉదయం వచ్చిన పెళ్లి కొడుకు రూమ్‌లోకి వెళ్లి డోర్‌ వేసుకున్నాడు. బయటకు లేదు. డోర్‌ కొట్టి పిలిచారు. అయినా బయటకు రాలేదు. దీంతో మరో తాళం పెట్టి తెరిచి చూస్తే… అందరూ ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.

కాసేపట్లో తాళి కట్టి పెళ్లిచేసుకోవాల్సిన వరుడు… ఎందుకు సూసైడ్‌ చేసుకున్నాడు… అని పెళ్లి మండపంలో చర్చగా మారింది.

దిల్‌షుఖ్ నగర్ నివాసి శ్రీనివాసాచారి కుమారుడు సందీప్‌. బాలానగర్‌కు చెందిన మౌనికతో పెళ్లి నిశ్చయమైంది. మూడు నెలల కింద ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆదివారం ఉదయం 11.35 నిమిషాలకు పెళ్లి ముహూర్తం. ఉదయం 3.30 గంటలకు పెళ్లి కొడుకు సందీప్ ఫంక్షన్ హాల్‌కు వచ్చారు. కొన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత నిద్ర వస్తుందని పెళ్లి కొడుకు రూమ్‌కు వెళ్లి డోర్‌ వేసుకున్నాడు.

ఉదయం ముహూర్తం టైమ్‌కు రూమ్‌ డోర్‌ కొడితే తీయకపోవడంతో వెంటనే బంధువులు వేరే కీ తో డోర్‌ తీశారు. అప్పటికే సందీప్‌ నిర్జీవంగా పడి ఉన్నాడు, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సందీప్‌ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.

వరుడు సందీప్‌ తల్లి 16 ఏళ్ల కిందటే చనిపోయింది. అమ్మమ్మ,తాత దగ్గర పెరిగాడు. మూడు నెలల కిందట తాత చనిపోయాడు. అప్పటి నుంచి సందీప్‌ డిప్రెషన్‌లో పడిపోయాడు. చిన్ననాటి నుంచి పెంచిన తాత చనిపోవడంతో కలిచివేసి మనస్తాపంతో సందీప్‌ చనిపోయినట్లు భావిస్తున్నామని పేట్‌ బషీరాబాద్‌ సీఐ మహేష్‌ చెప్పారు.

అయితే కుటుంబసభ్యులు మాత్రం మృతిపై విచారణ జరిపించాలని కోరారు. సందీప్‌ అమ్మ చనిపోయిన తర్వాత తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో అమ్మ ద్వారా ఏమైనా సమస్యలు ఉండవచ్చనేది కుటుంబసభ్యుల వాదన. రాత్రి వరకూ ఉల్లాసంగా ఉన్న సందీప్ ఎలా చనిపోయాడనేది మిస్టరీగా మారింది.

First Published:  10 Nov 2019 8:39 AM GMT
Next Story