Telugu Global
Cinema & Entertainment

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'.... కొనడానికి ఎవరూ రావడం లేదట!

రాంగోపాల్ వర్మ.. వివాదాస్పద దర్శకుడు. అయితే ఎన్ని వివాదాలున్నా… ఆయన ప్రొఫెషన్ లో మాత్రం మునుపటి వాడి వేడి లేదు. వర్మ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చాలా సంవత్సరాలే అయింది. ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలన్నీ వివాదాలతోనే అంతో ఇంతో నడుస్తున్నాయి. సో వర్మ సినిమాను అతిగా ఊహించుకొని థియేటర్లకు వెళ్లి చూసే జనాలు తక్కువ మందే. మొన్నటి లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా అంతే… ఏపీలో లేట్ గా విడుదల కావడంతో స్పందన కరువైంది. అయితే […]

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.... కొనడానికి ఎవరూ రావడం లేదట!
X

రాంగోపాల్ వర్మ.. వివాదాస్పద దర్శకుడు. అయితే ఎన్ని వివాదాలున్నా… ఆయన ప్రొఫెషన్ లో మాత్రం మునుపటి వాడి వేడి లేదు. వర్మ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చాలా సంవత్సరాలే అయింది.

ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలన్నీ వివాదాలతోనే అంతో ఇంతో నడుస్తున్నాయి. సో వర్మ సినిమాను అతిగా ఊహించుకొని థియేటర్లకు వెళ్లి చూసే జనాలు తక్కువ మందే. మొన్నటి లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా అంతే… ఏపీలో లేట్ గా విడుదల కావడంతో స్పందన కరువైంది.

అయితే ఇప్పుడు తాజా రాజకీయాలపై సంధిస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ఉత్కంఠ రేపుతోంది. మొన్నటి ఎన్నికలు.. ఆ తర్వాత వాతావరణంపై వర్మ సంధిస్తున్న ఈ సినిమా రాజకీయంగా ఉత్కంఠ రేపుతున్న సినిమాగా ప్రేక్షకుల్లో మాత్రం ఆసక్తి రేపడం లేదు.

వర్మ దీనికి వివాదాలతో పీక్ పబ్లిసిటీ చేస్తున్నా కానీ… ఆశించిన మేర మాత్రం సినిమాపై హైప్ రావడం లేదట.. పైగా ఇది పొలిటికల్ కు అన్ సీజన్. మొన్ననే ఎన్నికలు ముగియడంతో ఆ వేడి లేదు.

తాజాగా రాంగోపాల్ వర్మ తన కొత్త సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ను దాదాపు 5 కోట్లకు ఏపీలో అమ్మడానికి పెట్టగా అంత భారీ ధరకు ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదని తెలిసింది.

వర్మ విజయాల ట్రాక్ రికార్డ్ చూసి సినిమాపై అంత డబ్బు పెట్టలేక అందరూ దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. జనంలోనూ, ఇటు బయ్యర్లలోనూ ఆసక్తి లేక కమ్మరాజ్యం ఢీలా పడిపోయిందా… అన్న చర్చ సాగుతోంది. వర్మ ఎంత ప్రయత్నించినా…. అంత రేటు పెట్టకపోవడానికి ఆయన సినిమాల విజయాల శాతమే కారణమంటున్నారు.

First Published:  10 Nov 2019 9:03 AM GMT
Next Story