Telugu Global
National

శివసేన కోర్టులోకి బాల్‌.... మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ వెనక్కి తగ్గింది. శివసేన కోర్టులోకి బాల్‌ పంపించింది. దమ్ముంటే శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సవాల్ విసిరింది. ముంబైలో మధ్యాహ్నం బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయరాదని నిర్ణయించింది. ఇదే విషయాన్ని కేర్‌టేకర్‌ సీఎం దేవేంద్రఫడ్నవీస్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొశ్యారీకు చెప్పారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని గవర్నర్‌కు తెలిపారు ఫడ్నవీస్‌. మహారాష్ట్రలో ఫలితాలు వచ్చి 16 […]

శివసేన కోర్టులోకి బాల్‌.... మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్‌
X

మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ వెనక్కి తగ్గింది. శివసేన కోర్టులోకి బాల్‌ పంపించింది. దమ్ముంటే శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సవాల్ విసిరింది.

ముంబైలో మధ్యాహ్నం బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయరాదని నిర్ణయించింది. ఇదే విషయాన్ని కేర్‌టేకర్‌ సీఎం దేవేంద్రఫడ్నవీస్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొశ్యారీకు చెప్పారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని గవర్నర్‌కు తెలిపారు ఫడ్నవీస్‌.

మహారాష్ట్రలో ఫలితాలు వచ్చి 16 రోజులు దాటింది. ఇప్పటివరకూ ఎవరూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో ఇప్పుడు ఎవరు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తారనేది పెద్ద ప్రశ్న. శివసేన,ఎన్సీపీ కలిసినా కాంగ్రెస్‌ మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో ఇప్పుడు ఈ పీటముడి ఎలా వీడబోతుంది? అనేది సస్పెన్స్‌గా మారింది.

మహారాష్ట్రంలో మొత్తం సీట్లు 288. మేజిక్ ఫిగర్‌ 145. బీజేపీకి 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు ,ఇతరులు 29 సీట్లు గెలిచారు. ఇప్పుడు శివసేన ముందు ఉన్న ఆప్షన్లు రెండే రెండు. ఒకటి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం. లేకపోతే కాంగ్రెస్‌,ఎన్సీపీతో కలిసి ముందుకు వెళ్లడం.

అయితే శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ రెడీగా లేదు. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు. ఆరు నెలల తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించొచ్చు. అయితే మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు సిద్ధంగా లేవని తెలుస్తోంది. దీంతో మహారాష్ట్రలో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.

First Published:  10 Nov 2019 8:56 AM GMT
Next Story