Telugu Global
NEWS

నేటినుంచే ఏటీపీ టూర్ ఫైనల్స్ సమరం

నడాల్ కు జోకో, ఫెదరర్ గండం 2019 సీజన్ ఏటీపీ టూర్ ముగింపు టోర్నీకి లండన్ నగరంలో రంగం సిద్ధమయ్యింది. ఈ రోజు ప్రారంభమయ్యే ఈ టోర్నీలో ప్రపంచ టెన్నిస్ మొదటి 8 ర్యాంక్ ఆటగాళ్లు ఢీ కొనబోతున్నారు. భారీ ప్రైజ్ మనీ… ప్రపంచ టెన్నిస్ లో అత్యధిక భారీ ప్రైజ్ మనీ టోర్నీగా పేరుపొందిన…ఏటీపీ టూర్ ఫైనల్స్ లో పురుషుల టెన్నిస్ లో మొదటి ఎనిమిది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్లు…టైటిల్ కోసం రెండుగ్రూపులుగా ఢీ కొనబోతున్నారు. మొత్తం […]

నేటినుంచే ఏటీపీ టూర్ ఫైనల్స్ సమరం
X
  • నడాల్ కు జోకో, ఫెదరర్ గండం

2019 సీజన్ ఏటీపీ టూర్ ముగింపు టోర్నీకి లండన్ నగరంలో రంగం సిద్ధమయ్యింది. ఈ రోజు ప్రారంభమయ్యే ఈ టోర్నీలో ప్రపంచ టెన్నిస్ మొదటి 8 ర్యాంక్ ఆటగాళ్లు ఢీ కొనబోతున్నారు.

భారీ ప్రైజ్ మనీ…

ప్రపంచ టెన్నిస్ లో అత్యధిక భారీ ప్రైజ్ మనీ టోర్నీగా పేరుపొందిన…ఏటీపీ టూర్ ఫైనల్స్ లో పురుషుల టెన్నిస్ లో మొదటి ఎనిమిది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్లు…టైటిల్ కోసం రెండుగ్రూపులుగా ఢీ కొనబోతున్నారు.

మొత్తం ప్లేయర్లను జోర్న్ బోర్గ్, ఆండ్రీ అగాసీ పేర్లతో విభజించిన గ్రూపుల్లో చేర్చారు.

ఆరుసార్లు టూర్ ఫైనల్స్ విన్నర్ రోజర్ ఫెదరర్, ఐదుసార్లు విజేత నొవాక్ జోకోవిచ్ …ఒకే గ్రూపులో తలపడబోతున్నారు.
బోర్గ్ గ్రూపులో నొవాక్ జోకోవిచ్, రోజర్ ఫెదరర్, డోమనిక్ థైమ్, మోటియా బెరిటినీ తలపడనున్నారు.

అగాసీ గ్రూపులో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు రాఫెల్ నడాల్, డిఫెండింగ్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరేవ్,స్టెఫానోస్ సిటిస్ పాస్, డేనిల్ మెద్వదేవ్ ఉన్నారు.

నడాల్ కు జోకో, ఫెదరర్ సవాల్

2011లో చివరిసారిగా ఏటీపీ టూర్ విన్నర్ గా ఫెదరర్ నిలిస్తే…ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నడాల్ ఒక్కసారీ విజేతగా నిలువలేకపోడం విశేషం.

గ్రూపు రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో సాగే ఈ టోర్నీలో… గ్రూపులో మొదటి రెండుస్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు సెమీఫైనల్స్ లో తలపడతారు.నవంబర్ 10 నుంచి 17 వరకూ ఈ మెగా టోర్నీ జరుగనుంది.

First Published:  9 Nov 2019 9:32 PM GMT
Next Story