Telugu Global
National

ప్రవీణ్‌ ప్రకాశ్‌ కీలక నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్‌ ప్రవీణ్‌ ప్రకాశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పలువురి అభినందనలు అందుకుంటున్నారు. చాలా ఏళ్లుగా ఏపీలో జీతాల చెల్లింపు విషయంలో పర్మనెంట్ ఉద్యోగులకు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మధ్య వివక్ష ఉంది. లక్షల్లో జీతాలు తీసుకునే ఐఏఎస్‌ల నుంచి పెద్దపెద్ద పర్మనెంట్‌ ఉద్యోగులకు ఒకటో తేదినే జీతాలు పడుతున్నాయి. ఒకటి రెండు రోజులు […]

ప్రవీణ్‌ ప్రకాశ్‌ కీలక నిర్ణయం
X

ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్‌ ప్రవీణ్‌ ప్రకాశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పలువురి అభినందనలు అందుకుంటున్నారు. చాలా ఏళ్లుగా ఏపీలో జీతాల చెల్లింపు విషయంలో పర్మనెంట్ ఉద్యోగులకు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మధ్య వివక్ష ఉంది.

లక్షల్లో జీతాలు తీసుకునే ఐఏఎస్‌ల నుంచి పెద్దపెద్ద పర్మనెంట్‌ ఉద్యోగులకు ఒకటో తేదినే జీతాలు పడుతున్నాయి. ఒకటి రెండు రోజులు ఆలస్యం అయితే జీతాల చెల్లింపుల్లో ఇబ్బందులు అంటూ మీడియా కూడా పెద్దెత్తున గగ్గోలు పెట్టడం తెలుగు రాష్ట్రాల్లో కామన్.

కానీ తక్కువ జీతాలతో బతికే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు నెలనెల అందించే ఆనవాయితీ చాలా ఏళ్లుగా లేదు. మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకొసారి బిల్లు చేస్తుంటారు. చంద్రబాబు దిగిపోతూ అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగుల ఆరు నెలల జీతాలను పెండింగ్‌లో ఉంచి వెళ్లారు.

జీతాలు ఆలస్యమైనా తట్టుకునే సామర్థ్యం ఉన్న భారీ వేతనదారులకు నెలనెలా చెల్లిస్తూ… చిరుద్యోగులైన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందకపోవడంపై ప్రవీణ్‌ ప్రకాశ్ తన స్పందనను తెలియజేశారు.

తాను పనిచేస్తున్న సాధారణ పరిపాలన రాజకీయ విభాగంలోని గ్రూప్‌3, గ్రూప్‌ 4 , కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించిన తర్వాతే తన జీతం చెల్లించాలని తన శాఖ అధికారులకు లేఖ రాశారు.

తనకు జీతం ఆలస్యం అయినా భరించే శక్తి ఉందని… కాబట్టి తక్కువ జీతాలతో నెట్టుకొస్తున్న గ్రూప్‌ 3, గ్రూప్‌ 4 ఉద్యోగులకు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించిన తర్వాత తన జీతం ఇవ్వాలని కోరారు. తన జీతం డిసెంబర్‌ 1నే వేయాల్సిన అవసరం లేదని… ఇతరులకు జీతాలు ఇచ్చిన తర్వాతే తన జీతాన్ని జమ చేయాలని కోరారు.

First Published:  10 Nov 2019 9:54 AM GMT
Next Story