అది రీమేక్ కాదు నమ్మండి!

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ అయిన వెంటనే ఆ ప్రాజెక్టుపై పుకార్లు ప్రారంభమయ్యాయి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తేరి సినిమాకు రీమేక్ గా ఇది వస్తుందంటూ చాలా కథనాలు వచ్చాయి. అప్పట్లో దీనిపై స్పందించిన యూనిట్ తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది. తేరి సినిమా ఆధారంగా రవితేజ సినిమా ఉండదంటున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.

కొన్ని యదార్థ సంఘటనల్ని బేస్ చేసుకొని తను ఓ కథ రాసుకున్నానని, అది ఓ పోలీసాఫీసర్ కథ అని అంటున్నాడు. తేరి సినిమాలో విజయ్ పాత్రకు దగ్గరగా రవితేజ పోలీస్ క్యారెక్టర్ కనిపిస్తే అది తమ తప్పుకాదంటున్నాడు. అంటే.. తేరిలో విజయ్ పాత్రకు దగ్గరగా రవితేజ క్యారెక్టర్ ఉంటుందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించాడమన్నమాట.

మరోవైపు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సముత్తరఖనిని తీసుకున్నారు. ద‌ర్శ‌క‌త్వం నుండి న‌ట‌న వైపు అడుగులేసి విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకుంటూ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఇతడు దర్శకత్వం కంటే నటనపైనే ఎక్కువగా దృష్టిపెట్టాడు.

బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మ‌రోసారి శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.