ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా విజయ్‌ చందర్‌

నటుడు విజయ్‌ చందర్‌కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించింది. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పలు భక్తి సినిమాల్లో విజయ్‌ చందర్‌ నటన ప్రశంసలు అందుకుంది. సాయిబాబాగా ఆయన నటన అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు స్వయాన విజయ్‌ చందర్‌కు తాత. జగన్‌మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే విజయ్‌ చందర్‌ కొనసాగుతున్నారు.

ఫిల్మ్ కార్పొరేషన్‌ చైర్మన్ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డప్పటికీ తొలి నుంచి తనతో ఉన్న విజయ్‌చందర్‌ వైపే జగన్ మొగ్గు చూపారు.