Telugu Global
NEWS

చహార్ హ్యాట్రిక్.... భారత్ మ్యాజిక్

సీజన్ లో తొలి సిరీస్ నెగ్గిన భారత్ ప్రపంచకప్ కు సన్నాహకంగా బంగ్లాదేశ్ తో జరిగిన తీన్మార్ టీ-20 సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకొంది. నాగపూర్ విదర్భ స్టేడియం వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి టీ-20 మ్యాచ్ లో భారత్ 30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. రాహుల్- అయ్యర్ జోరు… సిరీస్ విజేతను నిర్ణయించే ఈ నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ లో..టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో […]

చహార్ హ్యాట్రిక్.... భారత్ మ్యాజిక్
X
  • సీజన్ లో తొలి సిరీస్ నెగ్గిన భారత్

ప్రపంచకప్ కు సన్నాహకంగా బంగ్లాదేశ్ తో జరిగిన తీన్మార్ టీ-20 సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకొంది. నాగపూర్ విదర్భ స్టేడియం వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి టీ-20 మ్యాచ్ లో భారత్ 30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.

రాహుల్- అయ్యర్ జోరు…

సిరీస్ విజేతను నిర్ణయించే ఈ నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ లో..టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 174 పరుగుల స్కోరు సాధించింది.

రాహుల్ 35 బాల్స్ లో 7 బౌండ్రీలతో 52 పరుగులు, శ్రేయస్ అయ్యర్ కేవలం 33 బాల్స్ లోనే 3 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 62 పరుగులు సాధించడంతో.. భారత్ మ్యాచ్ విన్నింగ్ స్కోరు నమోదు చేయగలిగింది. అయ్యర్ సిక్సర్ల హ్యాట్రిక్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

దీపక్ చహార్ హ్యాట్రిక్….

175 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఆట 12వ ఓవర్ వరకూ దూకుడు కొనసాగించింది. ఓపెనర్ నైమ్, రెండో డౌన్ మిథున్ మాత్రమే భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగుల మోత మోగించారు.

అయితే…భారత యువ ఆల్ రౌండర్ శివం దూబే 3 వికెట్లు, ఓపెనింగ్ బౌలర్ దీపక్ చహార్ 7 పరుగులకే 6 వికెట్లతో చెలరేగిపోడంతో…భారత్ విజేతగా నిలువగలిగింది.

బంగ్లా లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు సైఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అమీనుల్ ఇస్లాం వికెట్లను దీపక్ చహార్ వరుస ఓవర్లలో అవుట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధించాడు.

భారత్ కు 30 పరుగుల విజయంతో సిరీస్ ఖాయం చేశాడు.

టీ-20 క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సొంతం చేసుకొన్నాడు. సిరీస్ లో అత్యధికంగా 8 వికెట్లు సాధించడం విశేషం.

2019 సీజన్లో భారత్ కు ఇదే తొలి టీ-20 సిరీస్ విజయం కావడం విశేషం.

First Published:  10 Nov 2019 10:30 PM GMT
Next Story