Telugu Global
NEWS

భారత పేసర్ దీపక్ చహార్ ప్రపంచ రికార్డు

బంగ్లాదేశ్ తో ఆఖరి టీ-20లో హ్యాట్రిక్ ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత ఓపెనింగ్ బౌలర్ దీపక్ చహార్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాగపూర్ విదర్భ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో దీపక్ చహార్ విశ్వరూపమే ప్రదర్శించాడు. కేవలం 7 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి…ఈ ఘనత సాధించిన భారత, ప్రపంచ తొలి బౌలర్ గా రికార్డుల్లో చేరాడు. ఈ నిర్ణయాత్మక మ్యాచ్ లో..బంగ్లా టాపార్డర్ దూకుడుగా ఆడుతూ భారత్ ను […]

భారత పేసర్ దీపక్ చహార్ ప్రపంచ రికార్డు
X
  • బంగ్లాదేశ్ తో ఆఖరి టీ-20లో హ్యాట్రిక్

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత ఓపెనింగ్ బౌలర్ దీపక్ చహార్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాగపూర్ విదర్భ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో దీపక్ చహార్ విశ్వరూపమే ప్రదర్శించాడు. కేవలం 7 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి…ఈ ఘనత సాధించిన భారత, ప్రపంచ తొలి బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

ఈ నిర్ణయాత్మక మ్యాచ్ లో..బంగ్లా టాపార్డర్ దూకుడుగా ఆడుతూ భారత్ ను తీవ్రఒత్తిడిలో నెట్టిన సమయంలో దీపక్ చహార్.. తన పేస్ బౌలింగ్ వైవిధ్యంతో బంగ్లాను బోల్తా కొట్టించాడు.

ఆట ప్రారంభ ఓవర్లలో 2 వికెట్లు పడగొట్టిన చహార్ మిడిల్ ఓవర్లలో ఒకవికెట్, ఆఖరి ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి వారేవ్వా అనిపించుకొన్నాడు.

వరుస బంతుల్లో బంగ్లా లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు షఫీవుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అమీనుల్ ఇస్లాంల వికెట్లు పడగొట్టడం ద్వారా హ్యాట్రిక్ సాధించాడు.

భారత టీ-20 చరిత్రలోనే హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

చహార్ ప్రపంచ రికార్డు…

శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ పేరుతో ఉన్న 8 పరుగులకే 6 వికెట్ల ప్రపంచ రికార్డును దీపక్ చహార్ 7 పరుగులకే 6 వికెట్లు పడగొట్టడం ద్వారా తెరమరుగు చేశాడు.

టీ-20 చరిత్రలో 2012లో జింబాబ్వే పై అజంతా మెండిస్ 8 పరుగులకు 6 వికెట్లు, 2011లో పల్లెకెలీ వేదికగా ఆస్ట్ర్రేలియాపై 16 పరుగులకు 6 వికెట్లు, 2017లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్ పై యజువేంద్ర చాహల్ 25 పరుగులకు 6 వికెట్లు సాధించడమే అత్యుత్తమ రికార్డులుగా ఉన్నాయి.

First Published:  10 Nov 2019 9:55 PM GMT
Next Story