మహేష్ బాటలో ఎన్టీఆర్….

మన టాలీవుడ్ హీరోలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే తనకు ఉన్న స్టార్ డం తో సినిమాలే కాదు… అడ్వటైజ్ మెంట్లు చేస్తూ చేతినిండా సంపాదిస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు.

అంతేకాదు.. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఫ్యాషన్ సహా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి సంపాదిస్తున్నాడు. మహేష్ బాబు నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాడు.

ఇప్పుడు మహేష్ బాటలోనే హీరోలు రాంచరణ్, ప్రభాస్, నాని, విజయ్ దేవరకొండ కూడా నడుస్తున్నారు.

తాజాగా వీరందరి బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నట్టు తెలిసింది. త్వరలోనే ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మహేష్ లాగానే సినిమాల నిర్మాణం వైపు ఎన్టీఆర్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత తనే సొంతంగా నిర్మాణ సంస్థకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ అనే నిర్మాణ సంస్థ ఉంది. దీన్ని కళ్యాణ్ రామ్ నిర్వహిస్తున్నాడు. దీనికి ప్రతిగా ఇంకోటి ఎన్టీఆర్ పెడుతున్నాడట.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడితో సినిమా ప్లాన్ చేశాడని.. దీన్ని తన సొంత నిర్మాణ సంస్థలో చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది.