Telugu Global
NEWS

సచిన్ 30 ఏళ్ల రికార్డు తెరమరుగు

మాస్టర్ రికార్డును అధిగమించిన షఫాలీ భారత క్రికెట ర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో గత మూడు దశాబ్దాలుగా ఉన్న రికార్డు తెరమరుగయ్యింది. అత్యంత పిన్నవయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్ గా సచిన్ పేరుతో ఉన్న రికార్డును భారత మహిళా టీనేజ్ క్రికెటర్ షఫాలీ వర్మ అధిగమించింది. వెస్టిండీస్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గ్రాస్ ఐలెట్ వేదికగా ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో షఫాలీ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ […]

సచిన్ 30 ఏళ్ల రికార్డు తెరమరుగు
X
  • మాస్టర్ రికార్డును అధిగమించిన షఫాలీ

భారత క్రికెట ర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో గత మూడు దశాబ్దాలుగా ఉన్న రికార్డు తెరమరుగయ్యింది. అత్యంత పిన్నవయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్ గా సచిన్ పేరుతో ఉన్న రికార్డును భారత మహిళా టీనేజ్ క్రికెటర్ షఫాలీ వర్మ అధిగమించింది.

వెస్టిండీస్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గ్రాస్ ఐలెట్ వేదికగా ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో షఫాలీ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా.. సచిన్ పేరుతో ఉన్న రికార్డును తెరమరుగు చేసింది.

మూడుదశాబ్దాల క్రితం సచిన్ 16 సంవత్సరాల 214 రోజుల వయసులో తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.

గత 30 సంవత్సరాలుగా సచిన్ పేరుతో చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును షఫాలీ 15 సంవత్సరాల 285 రోజుల వయసులోనే సాధించడం ద్వారా అధిగమించింది.

షఫాలీ కేవలం 49 బాల్స్ లోనే 73 పరుగుల స్కోరు సాధించింది. తన కెరియర్ లో కేవలం 5వ టీ-20 మ్యాచ్ మాత్రమే ఆడిన షఫాలీ… మొదటి వికెట్ కు స్మృతి మంథానాతో కలసి 143 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. షెఫాలీ హాఫ్ సెంచరీలో 10 బౌండ్రీలు, 2 సిక్సర్లు ఉన్నాయి.

First Published:  11 Nov 2019 3:43 AM GMT
Next Story