Telugu Global
National

పవార్ చాణక్యం... బీజేపీతో శివసేన కటీఫ్

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చాణక్యం పనిచేసింది.. కాంగ్రెస్ తో దోస్తీ చేస్తున్న ఆయన వ్యూహాత్మకంగా మిత్రులైన బీజేపీని, శివసేనను దూరం చేస్తున్నారు. మహారాష్ట్రలో శరద్ పవర్ ఎత్తుగడ ఫలించి ఇప్పుడు శివసేన శాశ్వతంగా బీజేపీతో దోస్తీ కటీఫ్ చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో సరిపడా బలం లేని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు నుంచి వైదొలిగింది. గవర్నర్ ఇప్పుడు శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. దీంతో శివసేన మహారాష్ట్రలో తమతోపాటు మెజార్టీ సీట్లు […]

పవార్ చాణక్యం... బీజేపీతో శివసేన కటీఫ్
X

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చాణక్యం పనిచేసింది.. కాంగ్రెస్ తో దోస్తీ చేస్తున్న ఆయన వ్యూహాత్మకంగా మిత్రులైన బీజేపీని, శివసేనను దూరం చేస్తున్నారు. మహారాష్ట్రలో శరద్ పవర్ ఎత్తుగడ ఫలించి ఇప్పుడు శివసేన శాశ్వతంగా బీజేపీతో దోస్తీ కటీఫ్ చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్రలో సరిపడా బలం లేని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు నుంచి వైదొలిగింది. గవర్నర్ ఇప్పుడు శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. దీంతో శివసేన మహారాష్ట్రలో తమతోపాటు మెజార్టీ సీట్లు సాధించిన ఎన్సీపీని సంప్రదించింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఓ కండీషన్ పెట్టారు. ఎన్సీపీ.. దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ లు శివసేనకు మద్దతు ఇవ్వాలంటే వారిద్దరి ఉమ్మడి శత్రువైన బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని కండీషన్ పెట్టారట..

సో ఎన్సీపీ అధినేత కండీషన్.. దాని వెనుకున్న కాంగ్రెస్ పరోక్ష మద్దతు కోసం శివసేన ఏకంగా బీజేపీ సారథ్యంలో కేంద్రంలో ఏర్పడ్డ ఎన్డీఏ నుంచి వైదొలిగింది. శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఏ ప్రభుత్వంలో ఆయన భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజస్ మంత్రిగా పనిచేస్తున్నారు.

బీజేపీ నుంచి శివసేన వైదొలగడం.. శాశ్వతంగా పొత్తు తెంచుకొని దూరంగా జరగడంతో మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సీఎం క్యాండిడేట్ గా తెరపైకి వచ్చారు.

మహారాష్ట్రలో శివసేన 56 మందికి తోడుగా ఎన్సీపీకి 54 మంది, కాంగ్రెస్ 44 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ ముగ్గురు శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.

First Published:  11 Nov 2019 4:57 AM GMT
Next Story