Telugu Global
Cinema & Entertainment

కొత్త జానర్.. సూర్యకు కలిసొస్తుందా?

ఇప్పటివరకు చాలా జానర్స్ టచ్ చేశాడు హీరో సూర్య. కొన్ని సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. మరికొన్ని సినిమాలతో ఫ్లాప్స్ కొనితెచ్చుకున్నాడు. అయితే రీసెంట్ గా సూర్య చేసిన ఏ జానర్ అతడికి కలిసి రాలేదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చేసిన ఎన్జీకే ఫ్లాప్ అయింది. రీసెంట్ గా మరో జానర్ టచ్ చేస్తూ చేసిన బందోబస్త్ కూడా ఫ్లాప్ అయింది. దీంతో ఈసారి మరో కొత్త కథ ట్రై చేస్తున్నాడు సూర్య. సుధా కొంగర దర్శకత్వంలో […]

కొత్త జానర్.. సూర్యకు కలిసొస్తుందా?
X

ఇప్పటివరకు చాలా జానర్స్ టచ్ చేశాడు హీరో సూర్య. కొన్ని సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. మరికొన్ని సినిమాలతో ఫ్లాప్స్ కొనితెచ్చుకున్నాడు. అయితే రీసెంట్ గా సూర్య చేసిన ఏ జానర్ అతడికి కలిసి రాలేదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చేసిన ఎన్జీకే ఫ్లాప్ అయింది. రీసెంట్ గా మరో జానర్ టచ్ చేస్తూ చేసిన బందోబస్త్ కూడా ఫ్లాప్ అయింది. దీంతో ఈసారి మరో కొత్త కథ ట్రై చేస్తున్నాడు సూర్య.

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పటివరకు సూర్య టచ్ చేయని కథ ఇది. సక్సెస్ కోసం పరితపించే ఓ యంగ్ అండ్ ఎనర్జిటిక్ కుర్రాడిగా సూర్య ఇందులో కనిపించబోతున్నాడు.

గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఈ కథపై నమ్మకంతో సూర్య స్వయంగా నిర్మాతగా కూడా మారాడు. ఇప్పటికే సూర్యకు 2డీ ఎఁటర్ టైన్ మెంట్స్ అనే బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ పై ఇప్పటివరకు సహ-నిర్మాతగా, నిర్మాతగా చాలా సినిమాలు చేశాడు. కానీ తన సినిమాను తాను ఎప్పుడూ నిర్మించుకోలేదు. ఈ సినిమాకు సూర్య నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

First Published:  11 Nov 2019 7:00 AM GMT
Next Story