Telugu Global
NEWS

తెలుగు ఉద్యమంపై చేతులెత్తేసిన లోకేష్

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌ లు తీవ్ర స్థాయిలో నిరసన తెలపడంతో పలు విమర్శలు వచ్చాయి. మీ పిల్లలను పెద్దపెద్ద ఇంగ్లీష్ స్కూళ్లలో చదివిస్తూ… పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలనడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్న సామాన్యుల నుంచి తీవ్ర స్థాయిలో వచ్చింది. ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కు ఈ అంశం వారి వ్యక్తిగత జీవితాలకు చుట్టుకుంది. వీరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారన్న దానిపై […]

తెలుగు ఉద్యమంపై చేతులెత్తేసిన లోకేష్
X

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌ లు తీవ్ర స్థాయిలో నిరసన తెలపడంతో పలు విమర్శలు వచ్చాయి. మీ పిల్లలను పెద్దపెద్ద ఇంగ్లీష్ స్కూళ్లలో చదివిస్తూ… పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలనడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్న సామాన్యుల నుంచి తీవ్ర స్థాయిలో వచ్చింది.

ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కు ఈ అంశం వారి వ్యక్తిగత జీవితాలకు చుట్టుకుంది. వీరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారన్న దానిపై సామాన్యుల్లోనూ చర్చ మొదలైంది.

నష్టనివారణ చర్యలు అన్నట్టు లోకేష్ కాస్త వెనక్కు తగ్గారు. తమ హయాంలో మున్సిపల్‌ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేయగా జగన్‌ పత్రికలో అడ్డుకున్నారంటూ లోకేష్ తాజాగా ఆరోపించారు. అప్పట్లో జగన్‌ పత్రిక తెలుగు మీడియం తీసేస్తున్నారంటూ కథనాలు రాసిందని లోకేష్ వ్యాఖ్యానించారు.

ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేసిన లోకేష్ ఇప్పుడు హఠాత్తుగా తాము కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించామని చెప్పడం ద్వారా తమపై ప్రజల్లో వ్యక్తమవుతున్న కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నించినట్టుగా ఉంది.

పరోక్షంగా అప్పట్లో తాము ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తే జగన్ మీడియా విమర్శించింది కాబట్టే… ఇప్పుడు తాము ప్రతీకారంతో, రాజకీయ కోణంలో తిరిగి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్టుగా లోకేష్ చెప్పినట్టు అయింది.

అయితే పత్రికల్లో వివిధ వ్యక్తులు వ్యక్తం చేసే అభిప్రాయాలు జగన్ కు అంటగట్టి ట్వీట్ చేయడం లోకేష్ కే చెల్లింది.

First Published:  11 Nov 2019 6:25 AM GMT
Next Story