Telugu Global
National

బాబు, వెంకయ్య, పవన్‌... మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పండి...

ఏపీ ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్‌ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేరుగా విరుచుకుపడ్డారు. పేదవారికి ఇంగ్లీష్ చదువు ఎందుకు అని చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్ కల్యాణ్ లాంటి పెద్దవాళ్లు స్వరాలు వినిపిస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. విజయవాడ ఎన్‌కన్వెన్షన్‌ సెంటర్లో జరిగిన మౌలానా అబుల్ కలాం జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ మోహన్ రెడ్డి… పేదరికం నుంచి బయటపడాలంటే ఉన్న ఏకైక మార్గం చదువు మాత్రమేనన్నారు. తన పాదయాత్రలో […]

బాబు, వెంకయ్య, పవన్‌... మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పండి...
X

ఏపీ ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్‌ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేరుగా విరుచుకుపడ్డారు. పేదవారికి ఇంగ్లీష్ చదువు ఎందుకు అని చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్ కల్యాణ్ లాంటి పెద్దవాళ్లు స్వరాలు వినిపిస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.

విజయవాడ ఎన్‌కన్వెన్షన్‌ సెంటర్లో జరిగిన మౌలానా అబుల్ కలాం జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ మోహన్ రెడ్డి… పేదరికం నుంచి బయటపడాలంటే ఉన్న ఏకైక మార్గం చదువు మాత్రమేనన్నారు. తన పాదయాత్రలో స్థోమత లేక పిల్లలను చదివించుకోలేకపోతున్న ఎంతో మందిని చూశానన్నారు.

ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా, ఏ ఉద్యోగం కావాలన్నా ప్రపంచంతో పోటీ పడాల్సి వస్తోందన్నారు. ఇంగ్లీష్ రాకుండా ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి లేదన్నారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెడితే దానిపైనా కొందరు విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

ఇంగ్లీష్ మీడియం పేదవాడికి ఎందుకు అంటూ కొందరు స్వరాలు వినిపిస్తున్నారని… అలాంటి స్వరాలు వినిపిస్తున్న వారంతా చంద్రబాబు, వెంకయ్యనాయుడు లాంటి పెద్దవాళ్లు, పవన్ కల్యాణ్ వంటి పెద్దపెద్ద సినిమా యాక్టర్‌తో పాటు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలు రోజూ ఇంగ్లీష్‌ మీడియంకు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నాయని సీఎం మండిపడ్డారు.

ఇంగ్లీష్ మీడియంలో మన పిల్లలు చదివితే అది రాష్ట్రానికి మంచిది కాదా అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబు, వెంకయ్యనాయుడులు వారి కుమారులను, మనవళ్లను ఏస్కూల్‌లో, ఏ మీడియంలో చదివించారో చెప్పాలన్నారు. యాక్టర్‌ పవన్ కల్యాణ్‌కు ముగ్గురు భార్యలున్నారని… వారికి నలుగురో ఐదుగురో పిల్లలున్నారని వారంతా ఏ మీడియంలో చదువుతున్నారో పవన్ కల్యాణ్ చెప్పాలన్నారు.

పిల్లలకు సరైన చదువు ఇవ్వకపోతే జాతి నష్టపోతుందన్నారు. చదువు కోసం ఏ పేదవాడు అప్పులు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. అందరికీ విద్యలో సమాన అవకాశాలు దక్కేలా చేయాలన్నదే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్‌ మీడియం తెస్తున్నామని… అదే సమయంలో తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేస్తామని ప్రకటించారు.

తొలి దశలో ఒకటి నుంచి 6 వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతామని.. ఆ తర్వాత ఏడాదికి ఒక్కో తరగతిని ఇంగ్లీష్ మీడియం చేస్తూ వెళ్తామన్నారు. ఎక్కడ ఏ పరీక్ష జరిగినా ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఢీకొట్టేలా తీర్చిదిద్దుతామన్నారు.

First Published:  11 Nov 2019 5:23 AM GMT
Next Story