Telugu Global
National

వైఎస్‌ తప్ప సీమను పట్టించుకున్న వాళ్లెవరు?

వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడి గేట్ల నుంచి 11,000 క్యూసెక్స్ నుండి 44,000 క్యూసెక్కులకు తీసుకుపోవాలని పనులు మొదలైతే నానా రచ్చ చేసారు. అవి వరదజలాల తరలింపుకే కానీ నికరజలాలకు కాదు అని చెప్పినా వినకుండా అల్లరి అల్లరి చేశారు. దేవినేని ఉమ కూడా తెలుగుదేశం తరుపున నానా రచ్చ చేశాడు. ఇక అప్పటి హైదరాబాద్ బ్రదర్స్ శోకం ఈ వరదను మించింది. అయినా స్థిరచిత్తంతో పనులు పూర్తి చేయించారు వైఎస్‌. చాలా చోట్ల ఈరోజు […]

వైఎస్‌ తప్ప సీమను పట్టించుకున్న వాళ్లెవరు?
X

వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడి గేట్ల నుంచి 11,000 క్యూసెక్స్ నుండి 44,000 క్యూసెక్కులకు తీసుకుపోవాలని పనులు మొదలైతే నానా రచ్చ చేసారు. అవి వరదజలాల తరలింపుకే కానీ నికరజలాలకు కాదు అని చెప్పినా వినకుండా అల్లరి అల్లరి చేశారు. దేవినేని ఉమ కూడా తెలుగుదేశం తరుపున నానా రచ్చ చేశాడు. ఇక అప్పటి హైదరాబాద్ బ్రదర్స్ శోకం ఈ వరదను మించింది. అయినా స్థిరచిత్తంతో పనులు పూర్తి చేయించారు వైఎస్‌.

చాలా చోట్ల ఈరోజు మా రాయల సీమ పచ్చగా ఉందంటే అది వైయస్సార్ చలువే. అవుకు,చిత్రావతి రిజర్వాయర్స్ సామర్ధ్యం పెంచడం కావొచ్చు, పైడిపాలెం లాంటి కొత్త రిజర్వాయర్స్ కావొచ్చు.. హంద్రీ నీవాలో నీళ్లు పారడం కావొచ్చు.. పెట్టింది అమ్మ అని సామెత… అందుకే రైతులు వైయస్సార్ ను ఇప్పటికీ తలచుకుంటూనే ఉన్నారు..

ఇటీవలి కాలంలో వరద వచ్చే సమయం తక్కువైనందున గేట్స్ పెంచుతున్నాం అంటే వరద తక్కువ రోజులు వస్తుందని ఎవరు చెప్పారని కొందరు మేధావులూ ప్రశ్నించారు. ఈ ఏడాది కాకుండా గత కొన్నేళ్లుగా చూస్తే ఎక్కడో మహారాష్ట్ర, కర్నాటకల్లో క్లౌడ్ బర్స్ట్ అయి వరద రావడమే తప్ప ఈసారి లాగా ఎప్పుడూ రాలేదని అందరికీ తెలుసు.

గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈసారి ఇన్నిరోజులు వరద వచ్చినా సరిగ్గా ఉపయోగించుకోలేక పోయాము. ఆ హంద్రీ నీవా కాలువే తీసుకుంటే ఎత్తిపోసే పంపుల సంఖ్య పెంచకుండా కాలువ వెడల్పు అంటూ సీ.యం.రమేష్ కు 1000 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారు చంద్రబాబు ప్రభుత్వంలో. ఏమన్నా అంటే నీళ్లు త్వరగా చేరాలంట..

సరే గతం గతః …

ఆ శాపం ఒక్క నీటి పారుదల విషయంలోనే కాదు…

అప్పట్లో అనంతపురం జిల్లాకు రావాలసిన AIIMS ను ఎక్కడో విజయవాడకు తరలించారు చంద్రబాబు.

ఆ తర్వాత central university అన్నారు..ఏమైందో తెలియదు…

ఇక ఆ తిరుపతికి కేంద్ర నాయకులూ వస్తుంటారు కాబట్టి ఆ స్వామి మహిమో, మరొకటో ఒకటీ అరా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ అక్కడే పెట్టారు. IIT,IISER,catering institute లాంటివి.., మిగిలిన జిల్లాల్లో ఒక్కటీ కనిపించవు.

ఆ మధ్య కర్నూల్ జిల్లాలో వేల ఎకరాలున్న తంగెడంచ భూములు ప్రైవేట్ సంస్థలకు గత ప్రభుత్వం కట్టబెట్టింది. వాటిని స్వాధీనం చేసుకుని కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం పెడతారన్నారు. అదేమైందో దేవుడికెరుక…(దేశం లో అన్నిరకాల నేలలుండి, విత్తనాభివృద్ధికి అనువైన నేలలు, వాతావరణం ఉండే ప్రాంతాలు మూడు. వాటిలో నంద్యాల పరిసరప్రాంతం ఒకటని ఎప్పుడో తెల్లోళ్లకాలం నాటి నివేదిక ఉంది)

పర్యాటక రంగం పరిస్థితీ అంతే..ఇటీవల చెన్నై,బెంగుళూరు, హైదరాబాద్ నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లేపాక్షి, పెనుగొండ, కదిరి… అహోబిలం,యాగంటి..బెలుం గుహలు లాంటి చోట్లకు పర్యటనలకు వస్తున్నా సరైన సౌకర్యాలు లేవు.

అసలు రాజంపేట సమీపంలో అరుదైన పరుశురామాలయం, అదీ గజపృష్టాకార గోపురంతో ఉన్నది ఎందరికి తెలుసు?

ఇప్పటి దాకా అతి ప్రాచీనాలయంగా చరిత్రకెక్కిన రేణిగుంట దగ్గరున్న గుడిమల్లం,అక్కడి శిశ్నం ఆకారంలో ఉన్న ఆలయం చూసినవాళ్లెందరు?

విజయనగర రాజుల అద్భుత కళాసృష్టి తాడిపత్రి ఆలయాలు చూసినవాళ్లెందరు?

కడప లో పెద్ద దర్గా… ఆ సమీపంలో..పుష్పగిరి ఆలయ సముదాయం..పెన్నా నదికి ఇరువైపులా ఉంటాయి..వైయస్సార్ పాలన రోజుల్లో అక్కడ మారేడుమిల్లి, లక్నవరం లాగా సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టాలని ప్రణాళికలు సిద్ధమైనా అది మూలన పడింది. గ్రాండ్ కానియన్ లాంటి గండికోట… కర్నాటక చిత్రదుర్గ కోటను మరపించే గుత్తి, రాయదుర్గం కోటలు…ఎన్నెన్నో.. రాయలసీమలో ఉన్నాయి.

ఇవేనా… గత 2 నెలలుగా హై కోర్ట్ కోసం లాయర్లు విధులు బహిష్కరించారు.

పేరుకు, చాలామంది అనడానికి రాయలసీమ ప్రాంతం నాయకులే కానీ మేమేం పెరుక్కుతినడం లేదు. అసలు ఎప్పుడు అనుమతులొచ్చాయో ఏమో…. మొన్నటికి మొన్న సూళ్ళూరుపేట లో ప్లాస్టిక్ ఇన్స్టిట్యూట్ కు శంకుస్థాపన చేసారు. కానీ రాయలసీమలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.

-గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి

First Published:  11 Nov 2019 12:35 AM GMT
Next Story