Telugu Global
Cinema & Entertainment

RRR అప్ డేట్స్

సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఆర్-ఆర్-ఆర్ మూవీ. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి ఒకేసారి రెండు షెడ్యూల్స్ ను కొనసాగిస్తున్నాడు దర్శకుడు. ఉదయం రామ్ చరణ్ తో, రాత్రి ఎన్టీఆర్ తో షూటింగ్ చేస్తున్నాడు. పూణె షెడ్యూల్ టైమ్ లో వచ్చిన నెల రోజుల గ్యాప్ ను ఇలా భర్తీ చేస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేశారు. ప్రస్తుతం ఆ సెట్ లో పగటిపూట […]

RRR అప్ డేట్స్
X

సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఆర్-ఆర్-ఆర్ మూవీ. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి ఒకేసారి రెండు షెడ్యూల్స్ ను కొనసాగిస్తున్నాడు దర్శకుడు. ఉదయం రామ్ చరణ్ తో, రాత్రి ఎన్టీఆర్ తో షూటింగ్ చేస్తున్నాడు. పూణె షెడ్యూల్ టైమ్ లో వచ్చిన నెల రోజుల గ్యాప్ ను ఇలా భర్తీ చేస్తున్నాడు రాజమౌళి.

ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేశారు. ప్రస్తుతం ఆ సెట్ లో పగటిపూట రామ్ చరణ్ పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ ఉండగా, బ్రిటిషర్ల పాత్రధారులతో కోర్టుకు సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన వెంటనే, ఎన్టీఆర్ కు చెందిన సన్నివేశాల్ని హైదరాబాద్ శివార్లలో వేసిన మరో సెట్ లో నైట్ మోడ్ లో తీస్తున్నారు.

ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే రామోజీ ఫిలింసిటీలో షెడ్యూల్ ప్రారంభం అవుతోంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా షూట్ పూర్తిచేస్తున్నారు. కాస్త రెస్ట్ తీసుకొని సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ శివార్లలో మళ్లీ షూటింగ్. రాత్రి 11-12 గంటల వరకు ఇది నడుస్తోంది. ఇలా 15 రోజుల పాటు షెడ్యూల్ ఫిక్స్ చేశాడు రాజమౌళి.

వచ్చే ఏడాది జూన్ 30కి ఆర్-ఆర్-ఆర్ ను థియేటర్లలోకి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ స్పీడ్ తో పనిచేయకపోతే ఆ టైమ్ కు సినిమా రిలీజ్ కష్టం అంటున్నారు. అందుకే రాజమౌళి ఇలా పగలు-రాత్రి తేడా లేకుండా వర్క్ చేస్తున్నాడు.

First Published:  12 Nov 2019 5:07 AM GMT
Next Story