Telugu Global
NEWS

భారత షూటర్ తేజస్వినికి ఒలింపిక్స్ బెర్త్

టోక్యో ఒలింపిక్స్ కు 12 మంది భారత షూటర్ల అర్హత ఒలింపిక్స్ కు అర్హత సాధించాలన్న తన జీవితలక్ష్యాన్ని భారత షూటర్ తేజస్విని సావంత్ మూడో ప్రయత్నంలో నెరవేర్చుకో గలిగింది. టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే 2020 ఒలింపిక్స్ అర్హత పోటీలలో తేజస్విని అత్యుత్తమంగా రాణించడం ద్వారా ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ అర్హత పోటీలలో వెంట్రుక వాసిలో విఫలమైన తేజస్విని…టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీలలో మాత్రం పూర్తిస్థాయిలో రాణించింది. మహిళల […]

భారత షూటర్ తేజస్వినికి ఒలింపిక్స్ బెర్త్
X
  • టోక్యో ఒలింపిక్స్ కు 12 మంది భారత షూటర్ల అర్హత

ఒలింపిక్స్ కు అర్హత సాధించాలన్న తన జీవితలక్ష్యాన్ని భారత షూటర్ తేజస్విని సావంత్ మూడో ప్రయత్నంలో నెరవేర్చుకో గలిగింది. టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే 2020 ఒలింపిక్స్ అర్హత పోటీలలో తేజస్విని అత్యుత్తమంగా రాణించడం ద్వారా ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ అర్హత పోటీలలో వెంట్రుక వాసిలో విఫలమైన తేజస్విని…టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీలలో మాత్రం పూర్తిస్థాయిలో రాణించింది.

మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో మొత్తం 1200 పాయింట్లకు 1, 171 పాయింట్లు సాధించడం ద్వారా నాలుగోస్థానంలో నిలిచింది. 435.8 పాయింట్లతో తేజస్విని ఒలింపిక్స్ కు అర్హత సంపాదించింది.

తేజస్వినికి ముందే వివిధ విభాగాలలో ఇప్పటికే 11 మంది భారత షూటర్లు టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించగలిగారు.

First Published:  11 Nov 2019 8:57 PM GMT
Next Story