Telugu Global
National

"నేను చదివింది మాతృభాషలోనే..." మనవళ్ల గురించి చెప్పని వెంకయ్య

తమ పిల్లలను పెద్దపెద్ద ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో చదివిస్తున్న కొందరు మీడియా పెద్దలు, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ లాంటి వారు మొదలుపెట్టిన ఇంగ్లీష్ మీడియం వ్యతిరేక ఉద్యమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా మద్దతు తెలిపారు. దాంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి… ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకయ్య, చంద్రబాబు, పవన్‌ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలని… పేదల పిల్లలు […]

నేను చదివింది మాతృభాషలోనే... మనవళ్ల గురించి చెప్పని వెంకయ్య
X

తమ పిల్లలను పెద్దపెద్ద ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో చదివిస్తున్న కొందరు మీడియా పెద్దలు, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ లాంటి వారు మొదలుపెట్టిన ఇంగ్లీష్ మీడియం వ్యతిరేక ఉద్యమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా మద్దతు తెలిపారు.

దాంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి… ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకయ్య, చంద్రబాబు, పవన్‌ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలని… పేదల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? అని జగన్ ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ జేఎన్‌యూలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు… వీలైనన్ని భాషలు నేర్చుకోవాలి గానీ…పునాది మాత్రం మాతృభాషలోనే ఉండాలని చెప్పారు. తాను, రాష్ట్రపతి, ప్రధానితో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే చేశారని వెంకయ్యనాయుడు చెప్పారు.

ఇక్కడ విషయం ఏమిటంటే… వెంకయ్యనాయుడు, రామనాథ్ కోవింద్, నరేంద్రమోడీ ప్రాథమిక విద్య చదువుకునే కాలంలో వారే కాదు అందరూ మాతృభాషలోనే చదువుకున్నారు. ఇప్పుడు అంశం అది కాదు. మాతృ భాషలోనే చదువుకోవాలి అంటున్న వారు వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారన్నదే.

జగన్‌మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించింది… వెంకయ్యనాయుడు ఏ మీడియంలో చదువుకున్నారని కాదు… వెంకయ్యనాయుడు మనవళ్లు ఏ స్కూల్‌లో చదువుకుంటున్నారు అని ప్రశ్నించారు. కానీ వెంకయ్యనాయుడు మాత్రం ఆయన మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారో మాత్రం చెప్పలేదు. నిజానికి ఆయన చెప్పుకోలేరు కూడా.

ఎందుకంటే వెంకయ్యనాయుడు పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు.

కాబట్టి… తాను మాతృ భాషలోనే చదివానని చెప్పుకోగలరు కానీ… మనవళ్ల గురించి చెప్పుకోలేని పరిస్థితి.

First Published:  11 Nov 2019 10:57 PM GMT
Next Story