Telugu Global
NEWS

ఈ ఆనవాళ్లను బట్టి 150 కోట్ల ముడుపుల ఏపీ నేత ఎవరో తెలుసుకోవచ్చు....

నిర్మాణ రంగంలో కాంట్రాక్టులకు సంబంధించి ఆదాయపన్నుశాఖ బయటపెట్టిన అంశాలు సంచలనంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ” ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణ భారతదేశంలోని కొన్ని కంపెనీలపై దాడులు నిర్వహించగా… బోగస్ బిల్లింగ్ బయటపడింది. మౌలిక సదుపాయల ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను తప్పుడు మార్గాల్లో దారి మళ్లించారు. ఇందులో ఏపీకి చెందిన ముఖ్య వ్యక్తికి రూ. 150 కోట్లకుపైగా నగదు అందింది” అంటూ ఆదాయపన్ను శాఖ సోమవారం నోట్‌ను విడుదల చేసింది. […]

ఈ ఆనవాళ్లను బట్టి 150 కోట్ల ముడుపుల ఏపీ నేత ఎవరో తెలుసుకోవచ్చు....
X

నిర్మాణ రంగంలో కాంట్రాక్టులకు సంబంధించి ఆదాయపన్నుశాఖ బయటపెట్టిన అంశాలు సంచలనంగా ఉన్నాయి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ” ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణ భారతదేశంలోని కొన్ని కంపెనీలపై దాడులు నిర్వహించగా… బోగస్ బిల్లింగ్ బయటపడింది. మౌలిక సదుపాయల ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను తప్పుడు మార్గాల్లో దారి మళ్లించారు. ఇందులో ఏపీకి చెందిన ముఖ్య వ్యక్తికి రూ. 150 కోట్లకుపైగా నగదు అందింది” అంటూ ఆదాయపన్ను శాఖ సోమవారం నోట్‌ను విడుదల చేసింది.

బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా ఏకంగా రూ. 3,300 కోట్ల మేరకు నగదు పోగేయడం నుంచి ఆ డబ్బును సరఫరా చేయడం వరకు మొత్తం చెయిన్‌ను చేధించగలిగామని చెప్పింది. ఈ అంశంలో రూ. 150 కోట్లు అందుకున్న ఏపీకి చెందిన కీలక వ్యక్తి ఎవరన్నది ఆదాయపన్ను శాఖ త్వరలోనే వెల్లడిస్తుందని వివరించింది. తమకున్న సోర్స్‌ ద్వారా కొన్ని మీడియా సంస్థలు ఆ కీలక వ్యక్తి ఎవరన్న దానిపై ఆరా తీసి ఆనవాళ్లు ప్రచురించాయి.

ప్రముఖ పత్రిక కాస్త వివరంగానే ఈ అంశంపై వార్త రాసింది. గత ప్రభుత్వంలో మంత్రి నారాయణ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్‌ కంపెనీలు, గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్‌కు సంబంధించిన అకౌంటెంట్‌తోపాటు అప్పటి పోలవరం కాంట్రాక్టు సంస్థ నవయుగతో సహా అనేక కంపెనీలపై దాడులు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసింది.

”ఆ దాడుల్లో వెల్లడైన సమాచారం ఆధారంగా మరింత లోతుకు వెళ్లి… షెల్‌ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ. 364 కోట్లు ఎగవేసిన ఆరోపణల కేసులో సుజనా చౌదరికి చెందిన రూ. 315 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. నకిలీ ఆస్తులు, బోగస్‌ ఇన్వాయిస్‌లతో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకొని ఆ మొత్తాన్ని షెల్‌ కంపెనీల ద్వారా తరలించినట్లు ఈడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో హవాలా వ్యాపారుల పాత్రను గుర్తించింది. ఆ క్రమంలోనే నవంబర్‌ మొదటి వారంలో ఏపీ, తెలంగాణలో ఆదాయపన్నుశాఖ పలు చోట్ల దాడులు నిర్వహించింది.” అని ప్రముఖ పత్రిక వెల్లడించింది.

ఐటీ దాడులు మరింతగా జరిగితే తమ బండారం బయటపడుతున్న ఉద్దేశంతోనే అప్పటి ప్రభుత్వం ఐటీ అధికారులకు పోలీసు భద్రత ఇవ్వబోమని ప్రకటించిన విషయాన్ని కూడా ఢిల్లీలోని ఒక ఈడీ అధికారి గుర్తు చేశారని పత్రిక వెల్లడించింది. ఐటీ అధికారులకు భద్రత ఇవ్వబోమని గతంలో చంద్రబాబే ప్రకటించారు.

”ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీపై దాడులు నిర్వహించగా… బోగస్ బిల్లింగ్ బయటపడింది. మౌలిక సదుపాయల ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను తప్పుడు మార్గాల్లో దారి మళ్లించారు. ఇందులో ఏపీకి చెందిన ముఖ్య వ్యక్తికి రూ. 150 కోట్లకుపైగా నగదు అందింది” అంటూ ఐటీ చెప్పిన నేపథ్యంలో ఆ వ్యవహారం టీడీపీ హయాంలోనే జరిగిందన్నది స్పష్టమవుతోంది. బోగస్‌ బిల్లులు, హవాలా చెల్లింపులన్నీ ఈ ఏడాది ఏప్రిల్‌కు ముందు జరిగినవేనని తేలిపోతోంది.

”ప్రముఖ పత్రికాధిపతి వియ్యంకుడి కంపెనీకి రూ. 5 వేల కోట్ల విలువైన భారీ కాంట్రాక్టు కట్టబెట్టడమే కాకుండా గత ప్రభుత్వం రూ. 750 కోట్ల మేర మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చిన వ్యవహారంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఐటీశాఖ గుర్తించింది. ఈ కంపెనీ కార్యాలయాలపై 2018లోనే ఆదాయపన్నుశాఖ రోజుల తరబడి దాడులు నిర్వహించింది.

ఐదు వేల కోట్ల కాంట్రాక్టు అంటే పోలవరం కాంట్రాక్టేనని స్పష్టమవుతోంది. పోలవరం కాంట్రాక్టు సంస్థపై పలుమార్లు ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించి అక్రమాలను గుర్తించి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. సదరు కంపెనీ నుంచి ప్రభుత్వంలో ముఖ్యులకు హవాలా ద్వారా భారీగా నగదు చేరిందన్న విషయాన్ని ఐటీశాఖ గుర్తించింది. ఆ విషయం తెలిసిన తర్వాతే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబును ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోడీ రాజమండ్రి సభలో ఆరోపించారు” అని పత్రిక వివరించింది.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో కొన్ని ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. ఈ 150 కోట్ల ముడుపుల వ్యవహారం ఏప్రిల్‌కు ముందు అంటే టీడీపీ హయాంలోనే జరిగింది. పత్రికాధినేత వియ్యంకుడు, పోలవరం కాంట్రాక్టు అంటే అది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

ఈ నేపథ్యంలో ఆ 150 కోట్లు అందుకున్న నాటి ముఖ్య నేత ఎవరో ఇట్లే తెలిసిపోతోంది. గతేడాది ఆఖరిలో టీడీపీ నేతలపై ఐటీ దాడులు మొదలవగా ఐటీ అధికారులకు సెక్యూరిటీ ఇచ్చే ప్రసక్తే లేదని చంద్రబాబు ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

First Published:  13 Nov 2019 12:58 AM GMT
Next Story