మూడురోజుల్లో చహార్ రెండో హ్యాట్రిక్

  • క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత

భారత నయా స్వింగ్ కింగ్ దీపక్ చహార్ మరో అరుదైన రికార్డు సాధించాడు. మూడురోజుల వ్యవధిలో రెండు హ్యాట్రిక్ లు నమోదు చేసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.

నాగపూర్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో కేవలం 7 పరుగులకే హ్యాట్రిక్ తో సహా 6 వికెట్ల ప్రపంచ రికార్డు సాధించిన మూడురోజుల వ్యవధిలోనే రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు.

తిరువనంతపురం వేదికగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా రాజస్థాన్ తో ముగిసిన మ్యాచ్ 13వ ఓవర్లో దీపక్ చహార్ హ్యాట్రిక్ సాధించాడు.

విదర్భ ఆటగాళ్లు దర్శన్ నల్కండే, శ్రీకాంత్ వాగ్, అక్షయ్ వాడ్కర్ లను వరుస బంతుల్లో పెవీలియన్ దారి పట్టించాడు.

దీపక్ చహార్ 18 పరుగులకే 4 వికెట్లు సాధించినా…రాజస్థాన్ కు మాత్రం ఒక్క పరుగు ఓటమి తప్పలేదు.

క్రికెట్ చరిత్రలో …16 రోజుల వ్యవధిలో రెండుహ్యాట్రిక్ లు నమోదు చేసిన రికార్డు యువరాజ్ సింగ్ పేరుతో ఉంటే… ఇప్పుడు ఆ రికార్డును… దీపక్ చహార్ కేవలం మూడురోజుల వ్యవధిలోనే రెండు హ్యాట్రిక్ లు సాధించడం ద్వారా తెరమరుగు చేయగలిగాడు.