“తెనాలి” నా కోరిక తీర్చాడు – హన్సిక

తెనాలి రామకృష్ణ సినిమాతో తన కోరిక నెరవేరిందని చెబుతోంది హీరోయిన్ హన్సిక. నిజానికి తను లాయర్ ను అవ్వాలనుకున్నానని, ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరిందని చెప్పుకొస్తోంది. సెట్స్ లో తను ఎక్కువగా వాగుతుంటానని, లాయర్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తనతో చాలామంది చెబుతుంటారని, తను కూడా అలాంటి పాత్ర పోషించడానికి చాన్నాళ్లు వెయిట్ చేశానని అంటోంది ఈ ఆపిల్ బ్యూటీ. తెనాలి రామకృష్ణ సినిమాతో ఆ కోరిక నెరవేరిందని అంటోంది.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా కోర్టు, లాయర్ల చుట్టూ తిరుగుతుందని, కాకపోతే సస్పెన్స్, థ్రిల్లర్స్ లాంటివి ఉండవని, ఫన్నీగా ఉంటుందని చెప్పుకొచ్చింది. సినిమాలో తన తండ్రి మురళీ శర్మ ఫేమస్ లాయర్ కాబట్టి, తన పాత్ర కూడా లాయర్ అవ్వాలనుకుంటుందని వెల్లడించింది.

ఇక తెలుగులో రీఎంట్రీపై స్పందిస్తూ.. తెలుగులో తను కావాలని గ్యాప్ తీసుకోనని, ఇతర సినిమాల వల్ల అలా గ్యాప్ వచ్చేస్తుందని అంటోంది హన్సిక. తెనాలి రామకృష్ణ సక్సెస్ అయితే ఆమె తెలుగులో మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. అటు తమిళ్ నుంచి హన్సికకు పెద్దగా అవకాశాలు రావట్లేదు మరి.