హీరో రాజశేఖర్ కు తప్పిన ప్రమాదం…

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు బోల్తా పడింది. రామోజీ ఫిలిం సిటీ నుంచి షూటింగ్ ముగించుకొని ఇంటికి వస్తుండగా.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోని పెద్ద గోల్కోండ వద్ద ఊహించని విధంగా రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది.

అదృష్టవశాత్తూ ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో రాజశేఖర్ కు ఎటువంటి ప్రమాదం జరలేదు. కారు ప్రమాదం జరిగినప్పుడు రాజశేఖర్ ఒక్కరే కారులో ఉన్నారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. క్షేమంగా ఉన్నట్టు కొద్దిసేపటి క్రితమే తెలిపారు.

తన కారు యాక్సిడెంట్ కు గురికావడంపై రాజశేఖర్ తాజాగా స్పందించారు. ‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది’ అని రాజశేఖర్ తెలిపారు. ఆ సమయంలో కారులో తాను ఒక్కడినే ఉన్నానని.. కారు ప్రమాదానికి గురికాగానే కొందరు కారులో వస్తున్న వారు ఆగి తనను బయటకు తీశారని చెప్పుకొచ్చాడు. తనను గుర్తుపట్టి వారు వారి కారులో మా ఇంటికి తీసుకెళ్లారని తెలిపారు. వారి ఫోన్ తీసుకొని తాను పోలీసులకు, నా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చానని రాజశేఖర్ తెలిపారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు.