Telugu Global
NEWS

101వ ర్యాంక్ కు పడిపోయిన పేస్

సింగిల్స్ 95వ ర్యాంకులో ప్రజ్ఞేశ్ భారత ఆల్ టైమ్ గ్రేట్ టెన్నిస్ ప్లేయర్ 46 ఏళ్ల లియాండర్ పేస్..గత 19 సంవత్సరాలలో తొలిసారిగా డబుల్స్ టాప్ -100 ర్యాంకుల్లో చోటు కోల్పోయాడు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం వెటరన్ లియాండర్ పేస్ 101వ ర్యాంకులో నిలిచాడు. 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ లియాండర్ పేస్ ప్రస్తుత భారత ఆటగాళ్లలో నాలుగో అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ గా ఉన్నాడు. 38వ ర్యాంకులో రోహన్ బొపన్న డబుల్స్ […]

101వ ర్యాంక్ కు పడిపోయిన పేస్
X
  • సింగిల్స్ 95వ ర్యాంకులో ప్రజ్ఞేశ్

భారత ఆల్ టైమ్ గ్రేట్ టెన్నిస్ ప్లేయర్ 46 ఏళ్ల లియాండర్ పేస్..గత 19 సంవత్సరాలలో తొలిసారిగా డబుల్స్ టాప్ -100 ర్యాంకుల్లో చోటు కోల్పోయాడు.

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం వెటరన్ లియాండర్ పేస్ 101వ ర్యాంకులో నిలిచాడు. 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ లియాండర్ పేస్ ప్రస్తుత భారత ఆటగాళ్లలో నాలుగో అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ గా ఉన్నాడు.

38వ ర్యాంకులో రోహన్ బొపన్న

డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్ 38వ స్థానంలో రోహన్ బొపన్న నిలిచాడు. దివిజ్ శరణ్ 46, పూరవ్ రాజా 93 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

లియాండర్ పేస్ 2000 సంవత్సరంలో 118వ ర్యాంకులో నిలిచిన తర్వాత…19 సంవత్సరాలపాటు టాప్ -100 ర్యాంకుల్లో చోటు నిలుపుకోగలిగాడు.

2014 ఆగస్టులో తొలిసారిగా టాప్ -10లో చోటు కోల్పోయిన పేస్ …చివరకు 2019లో టాప్ -100లో సైతం చోటు కోల్పోక తప్పలేదు.

సింగిల్స్ లో ప్రజ్ఞేశ్ టాప్…

పురుషుల సింగిల్స్ లో భారత అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ గా ప్రజ్ఞేశ్ నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 95వ స్థానం సంపాదించాడు.

సుమిత్ నగాల్ 129వ ర్యాంక్ నుంచి రెండు స్థానాలు మెరుగు పరచుకొని 127వ ర్యాంకర్ గా ఉన్నాడు.

రామ్ కుమార్ రామనాథన్ 190, శశికుమార్ ముకుంద్ 250, సాకేత్ మైనేని 267 ర్యాంకుల్లో ఉన్నారు.

First Published:  13 Nov 2019 12:13 AM GMT
Next Story