Telugu Global
Cinema & Entertainment

మహర్షికి అరుదైన గౌరవం

మహేష్ 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి, మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ట్విట్టర్ లో ఈ ఏడాది అత్యధిక ప్రభావం చూపిన హ్యాష్ ట్యాగ్స్ లో మహర్షి కూడా ఒకటిగా నిలిచింది. మహేష్ 25వ చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దానికితోడు ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టడం, స్వయంగా మహేష్ అభిమానులు రంగంలోకి దిగడంతో మహర్షి అనే హ్యాష్ ట్యాగ్ మారుమోగిపోయింది. అలా ఈ ఏడాది అత్యంత ప్రభావం చూపించిన ట్విట్టర్ మూమెంట్ […]

మహర్షికి అరుదైన గౌరవం
X

మహేష్ 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి, మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ట్విట్టర్ లో ఈ ఏడాది అత్యధిక ప్రభావం చూపిన హ్యాష్ ట్యాగ్స్ లో మహర్షి కూడా ఒకటిగా నిలిచింది. మహేష్ 25వ చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దానికితోడు ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టడం, స్వయంగా మహేష్ అభిమానులు రంగంలోకి దిగడంతో మహర్షి అనే హ్యాష్ ట్యాగ్ మారుమోగిపోయింది. అలా ఈ ఏడాది అత్యంత ప్రభావం చూపించిన ట్విట్టర్ మూమెంట్ గా మహర్షి నిలిచింది.

ఈ మేరకు ట్విట్టర్ అధికారికంగా ఓ లిస్ట్ విడుదల చేశారు. ఇండియాలో ఈ ఏడాది అత్యధిక ప్రభావం చూపించిన మూమెంట్స్ లో మొదటి స్థానంలో విశ్వాసం హ్యాష్ ట్యాగ్ నిలిచింది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ నడిచింది. అజిత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో పాటు.. ఈ సినిమా విషయానికొచ్చేసరికి, భాషతో సంబంధం లేకుండా చాలామంది సినీప్రేమికులు విశ్వాసంపై ఆసక్తి చూపడంతో ఇది నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

ఇక రెండో స్థానంలో లోక్ సభ ఎలక్షన్స్ 2019 అనే హ్యాష్ ట్యాగ్, మూడో స్థానంలో సీడబ్ల్యూసీ 19(క్రికెట్ వరల్డ్ కప్), నాలుగో స్థానంలో మహర్షి, ఐదో స్థానంలో హ్యాపీ దివాళీ అనే హ్యాష్ ట్యాగ్స్ నిలిచాయి. మొత్తంగా చూసుకుంటే.. మహర్షి అనే హ్యాష్ ట్యాగ్ తో మహేష్ కు ఎంత పాపులారిటీ ఉందో మరోసారి తెలిసొచ్చింది. గమ్మత్తైన విషయం ఏంటంటే.. దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన సాహో హ్యాష్ ట్యాగ్ కు టాప్-5 లిస్ట్ లో స్థానం దక్కలేదు.

First Published:  13 Nov 2019 5:47 AM GMT
Next Story