మీడియా శ్రమ వృథా… టీడీపీ ఉండదు… 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి

చంద్రబాబు ఎంతగా తిరిగినా ఏపీలో టీడీపీ ఖాళీ అవడం మాత్రం ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు. చంద్రబాబు మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా చాలా ప్రయత్నిస్తోందని… కానీ ఫలితం లేదన్నారు.

చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 2024 నాటికి ఏపీలో బీజేపీనే ప్రత్యామ్నాయ శక్తి అవుతుందన్నారు.

23 మంది ఎమ్మెల్యేల కోసం…. చంద్రబాబు ఇంతగా కష్టపడాల్సిన పని లేదని… త్వరలోనే తాము వారందరినీ తీసుకుంటామన్నారు. అందుకు చంద్రబాబు కూడా సహకరిస్తే మంచిదన్నారు.

22 ఎమ్మెల్యేలతో పాటు ఆఖరిలో చంద్రబాబు కూడా బీజేపీలోకి వచ్చే పరిస్థితి వస్తుందేమో చూడాలన్నారు.