గోపీచంద్ సినిమా ఆగిపోయింది

కొన్ని రోజుల కిందట బిను సుబ్రమణ్యం దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ స్టార్ట్ చేశాడు హీరో గోపీచంద్. ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయింది. అవును.. ఈ సినిమా నుంచి తప్పుకోవాలని స్వయంగా గోపీచంద్ నిర్ణయించుకున్నాడు.

గతంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, గోపీచంద్ కాంబోలో సాహసం అనే సినిమా వచ్చింది. ఇది కూడా అలాంటి యాక్షన్ సినిమానే. పైగా భారీ బడ్జెట్ మూవీ కూడా. గోపీచంద్ వెనక్కి తగ్గడానికి కారణం కూడా ఇదే. రీసెంట్ గా అతడు చేసిన చాణక్య సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అది కూడా యాక్షన్ సినిమానే. అందుకే బీవీఎస్ఎన్ సినిమాను కూడా ఆపేశాడు. ప్రస్తుతం తన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని గోపీచంద్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

గోపీచంద్ కోసం బీవీఎస్ఎన్ ఎంత ఖర్చుపెట్టడానికైనా రెడీ. కానీ గోపీచంద్ కు ఇప్పుడు మార్కెట్ లేదు. పెట్టుబడి వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఇంత ఖర్చు అనవసరం. అందుకే సినిమా ఆపేశాడు గోపీచంద్. రీసెంట్ గా ఈ హీరోకు అన్నీ ఫ్లాపులే వస్తున్నాయి.