Telugu Global
NEWS

భారత్- బంగ్లా తొలిటెస్టుకు ఇండోర్ రెడీ

హాట్ ఫేవరెట్ గా భారత్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో మరో ఏకపక్ష సిరీస్ కు…ఇండోర్ లోని హోల్కార్ స్టేడియంలో తెరలేచింది. 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలిటెస్టులో టాప్ ర్యాంకర్ భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. లీగ్ లో ఇప్పటి వరకూ విండీస్, సౌతాఫ్రికా జట్లతో ఆడిన ఐదుకు ఐదు టెస్టులూనెగ్గి 240పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన భారత్.. వరుసగా ఆరో విజయానికి ఉరకలేస్తోంది. తిరుగులేనిరికార్డు… స్వదేశీ సిరీస్ ల్లో […]

భారత్- బంగ్లా తొలిటెస్టుకు ఇండోర్ రెడీ
X
  • హాట్ ఫేవరెట్ గా భారత్

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో మరో ఏకపక్ష సిరీస్ కు…ఇండోర్ లోని హోల్కార్ స్టేడియంలో తెరలేచింది. 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలిటెస్టులో టాప్ ర్యాంకర్ భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

లీగ్ లో ఇప్పటి వరకూ విండీస్, సౌతాఫ్రికా జట్లతో ఆడిన ఐదుకు ఐదు టెస్టులూనెగ్గి 240పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన భారత్.. వరుసగా ఆరో విజయానికి ఉరకలేస్తోంది.

తిరుగులేనిరికార్డు…

స్వదేశీ సిరీస్ ల్లో 11 విజయాలతో ఇప్పటికే ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్ ..12వ సిరీస్ విజయానికి ఉరకలేస్తోంది. 2013సీజన్ నుంచి స్వదేశీగడ్డపై ఆడిన మొత్తం 32 టెస్టుల్లో 26 విజయాలు, ఓ ఓటమి, ఐదు డ్రాల రికార్డుతో …భీకరమైన ఫామ్ లో ఉన్న భారత్..బంగ్లాతో రెండుకు రెం డుటెస్టులూ నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.

గత తొమ్మిదేళ్లలో ఆడిన 48 టెస్టుల్లో 35 విజయాలు సాధించిన భారత్ కు 16సార్లు 500కు పైగా స్కోర్లు సాధించిన రికార్డు సైతం ఉంది.

అంతేకాదు ప్రత్యర్థి జట్లను 200 స్కోర్లకే 36 సార్లు ఆలౌట్ చేయగలిగింది. షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్ లాంటి ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేని బంగ్లాజట్టుకు మోమినుల్ హక్ నాయకత్వం వహిస్తున్నాడు.

5వేల పరుగుల రికార్డు వైపు కొహ్లీ చూపు

ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు విరాట్ కొహ్లీ కెప్టెన్ గా 5వేల పరుగుల మైలురాయికి 32 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. టెస్ట్ బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో 900కు పైగా పాయింట్లు సాధించిన రెండో భారత క్రికెటర్ గా కూడా కొహ్లీ కొనసాగుతున్నాడు.
సునీల్ గవాస్కర్ తొలి ఆటగాడు కాగా… విరాట్ 926 పాయింట్లు సాధించాడు.

ఇండోర్ వేదికగా గతంలో ఆడిన టెస్టుమ్యాచ్ లో కొహ్లీకి 211 పరుగుల స్కోరు సాధించిన రికార్డు ఉంది. కెప్టెన్ గా 20 శతకాలు సాధించిన తొలి క్రికెటర్ సైతం కొహ్లీ మాత్రమే కావడం విశేషం.

అయితే…ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఐదురోజుల పాటు భారత్ కు పోటీ ఇవ్వగలదా లేక…నాలుగు రోజుల్లోనే చిత్తవుతుందా అన్నదే ఇక్కడి అసలు పాయింట్.

First Published:  13 Nov 2019 9:00 PM GMT
Next Story