మ‌హాటీవీ తెర‌పైకి ప‌ర‌కాల…. ఈ సారి సుజ‌నాతో టీమ్ !

ఏపీ ప్ర‌భుత్వ క‌మ్యూనికేష‌న్స్ మాజీ స‌ల‌హాదారు కొత్త అవ‌తారం ఎత్తారు. గ‌తంలో త‌న‌కు అల‌వాటు అయిన వ్యాఖ్య‌త‌గా మ‌ళ్లీ టీవీ స్క్రీన్‌ పైకి వ‌స్తున్నారు. అయితే ఈ సారి ప్లాట్‌ఫామ్ చేంజ్‌. మ‌హాన్యూస్ నుంచి తెర‌పైకి రాబోతున్నారు.

ప‌ర‌కాల గతంలో ఈటీవీ ప్ర‌తిధ్వ‌ని వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ నుంచి ప్ర‌జారాజ్యంలోకి జంప్ అయ్యారు. అక్క‌డి నుంచి టీడీపీతో క్లోజ్‌గా మూవ్ అయ్యారు. చంద్ర‌బాబుకి క‌మ్యూనికేష‌న్ స‌ల‌హాదారుడిగా ప‌నిచేశారు. ఓటుకు నోటు కేసు స‌మ‌యంలో ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ మాట‌లు అప్ప‌ట్లో వివాదాస్ప‌దంగా మారాయి.

ఆ త‌ర్వాత ప‌ర‌కాలకు చంద్ర‌బాబుతో గ్యాప్ వ‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అన్న‌ట్లుగానే ఆయ‌న ప‌ద‌వీకాలం పొడిగించ‌లేదు. ఎన్నిక‌ల టైమ్‌లో ఆయ‌న సేవ‌లు ఉప‌యోగించుకోలేదు. ఈలోపు ప‌రకాల సొంత వ్యాపారం పెట్టుకున్నారు. వెబ్‌సైట్‌తో పాటు ఇత‌ర స‌ర్వేలు చేప‌ట్టారు. అయితే త‌న భార్య ఆర్ధిక‌మంత్రికావ‌డంతో ఇప్పుడు ఆయ‌న్ని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు కొత్త ఎత్తుగ‌డ వేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌ర‌కాలకు మ‌హాటీవీ అప్ప‌గించ‌డం వెనుక ఇదే వ్యూహాం ఉంద‌ని అంటున్నారు.

మ‌హాటీవీని కొత్త‌గా లాంచ్ చేసేందుకు ప‌ర‌కాల టీమ్ ప్ర‌యత్నాలు ప్రారంభించింది. సంగీత ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ మాలిక్ తో క‌లిసి మహాటీవీ కోసం న్యూ మ్యూజిక్ కంపోజిష‌న్స్ చేప‌ట్టారు. ఈ ఫోటోల‌తో ఇప్పుడు ప‌ర‌కాల ప్ర‌భాకర్ కొత్త ఫ్లాట్‌ఫామ్‌పై చర్చ జ‌రుగుతోంది.

టీడీపీలో ఉన్న‌ప్పుడు కొంత‌కాలం మ‌హాటీవీని సుజ‌నా చౌద‌రి ర‌న్ చేశారు. కానీ ఆర్ధిక క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోవ‌డంతో ముందుకు పోలేదు. మ‌రి ఇప్పుడు ప‌ర‌కాల సార‌థ్యంలో ఏవిధంగా దూసుకెళుతుందో చూడాలి.