రవితేజ ‘క్రాక్’ మొదలైంది

ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో మూవీ స్టార్ట్ చేయడం రవితేజ స్టయిల్. ఈసారి కూడా మాస్ రాజా అదే పనిచేశాడు. డిస్కో రాజా సెట్స్ పై ఉంటుండగానే ‘క్రాక్’ అంటూ ఓ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తం షాట్ కు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ క్లాప్ కొచ్చారు. పరుచూరి వెంకటేశ్వర రావు కెమెరా స్విచాన్ చేశారు. సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ అందించారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతోంది క్రాక్. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు హిట్ అయ్యాయి. ఇది వీళ్ల కాంబినేషన్ లో మూడో సినిమా. శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది. ఓపెనింగ్ కు ఆమె కూడా వచ్చింది.

క్రాక్ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాయు. ఈ నెల్లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఠాగూర్ మధు ఈ సినిమాకు నిర్మాత.