Telugu Global
NEWS

బాట కష్టమైనదే.... శత్రువులు కూడా ఎక్కు వే.... అయినా ముందుకే....

కేవలం కొందరు బాగుపడితే సమాజం బాగుపడదని.. అందరూ బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు సీఎం వైఎస్ జగన్. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గ మన్నారు. పిల్లలకోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే.. రాజకీయం కోసం ఆరోపణలు చేస్తున్నారని… ఆరోపణలు చేసేవారు హిపోక్రసీని వదిలి డెమొక్రసీకి విలువ ఇవ్వాలని జగన్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను చదువుల దేవాలయాలుగా మారుస్తామన్నారు. రాజకీయ, మీడియా, సినీ ప్రముఖుల పిల్లలు తెలుగు మీడియంలో చదవడం లేదని… వారే తిరిగి ఇంగ్లీష్ ను […]

బాట కష్టమైనదే.... శత్రువులు కూడా ఎక్కు వే.... అయినా ముందుకే....
X

కేవలం కొందరు బాగుపడితే సమాజం బాగుపడదని.. అందరూ బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు సీఎం వైఎస్ జగన్. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గ మన్నారు. పిల్లలకోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే.. రాజకీయం కోసం ఆరోపణలు చేస్తున్నారని… ఆరోపణలు చేసేవారు హిపోక్రసీని వదిలి డెమొక్రసీకి విలువ ఇవ్వాలని జగన్ సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలను చదువుల దేవాలయాలుగా మారుస్తామన్నారు. రాజకీయ, మీడియా, సినీ ప్రముఖుల పిల్లలు తెలుగు మీడియంలో చదవడం లేదని… వారే తిరిగి ఇంగ్లీష్ ను వ్యతిరేకిస్తున్నారని సీఎం విమర్శించారు.

రాబోయే పదేళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించాలని, పదేళ్ల తర్వాత రోబోటిక్స్‌ కీలకం కానున్నాయని అన్నారు. పిల్లలకు ఇంగ్లీష్ చదువులు లేకపోతే వాళ్ల భవిష్యత్‌ ఎలా ఉంటుందో ఆలోచించండని కోరారు. ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను తీర్చిదిద్దాల్సిన అవసరం, బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఒక మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలనే ఉద్దేశంతో…. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

ఒంగోలులో ‘మన బడి నాడు-నేడు’ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం… ప్రతి కార్యక్రమంలోనూ సవాళ్లు ఉన్నాయని అయినా అడుగులు ముందుకు వేస్తున్నానని చెప్పారు. బాట కష్టమైనదే…శత్రువులు కూడా ఎక్కువగా ఉన్నారని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే కొన్ని సమస్యలు వస్తాయన్న విషయం తెలుసని వాటిని అధిగమించేందుకు బ్రిడ్జ్‌ కోర్సులు ఏర్పాటు చేయటం, టీచర్లకు శిక్షణ ఇవ్వటం చేస్తున్నామన్నారు. ఒకట్రెండు సంవత్సరాలు కష్టపడ్డా.. ఆ తర్వాత పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో ముందుకెళ్తారని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  14 Nov 2019 3:21 AM GMT
Next Story