Telugu Global
NEWS

ఇండోర్ టెస్టులో అశ్విన్ అరుదైన రికార్డు

కుంబ్లే, హర్భజన్ ల సరసన అశ్విన్ స్వదేశీగడ్డపై 250 వికెట్ల భారత మూడో బౌలర్ భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ స్వదేశీ పిచ్ లపై తన జోరు కొనసాగిస్తున్నాడు. ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలిటెస్టు తొలిరోజు ఆటలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. స్వదేశంలో ఆడిన టెస్టుమ్యాచ్ ల్లో 250 వికెట్లు సాధించిన భారత మూడో బౌలర్ గా రికార్డుల్లో చేరాడు. అంతేకాదు…అత్యంత వేగంగా 250 వికెట్లు మైలురాయి […]

ఇండోర్ టెస్టులో అశ్విన్ అరుదైన రికార్డు
X
  • కుంబ్లే, హర్భజన్ ల సరసన అశ్విన్
  • స్వదేశీగడ్డపై 250 వికెట్ల భారత మూడో బౌలర్

భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ స్వదేశీ పిచ్ లపై తన జోరు కొనసాగిస్తున్నాడు. ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలిటెస్టు తొలిరోజు ఆటలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

స్వదేశంలో ఆడిన టెస్టుమ్యాచ్ ల్లో 250 వికెట్లు సాధించిన భారత మూడో బౌలర్ గా రికార్డుల్లో చేరాడు. అంతేకాదు…అత్యంత వేగంగా 250 వికెట్లు మైలురాయి చేరిన రెండోటెస్ట్ బౌలర్ గా నిలిచాడు.

బంగ్లా కెప్టెన్ మోమినుల్ ను అవుట్ చేయడం ద్వారా…భారత గడ్డపై అశ్విన్ తన 250వ టెస్ట్ వికెట్ సాధించడం ద్వారా… గతంలో ఇదే ఘనత సాధించిన అనీల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ల సరసన చోటు సంపాదించాడు.

స్వదేశీ గడ్డపై కుంబ్లే 350, హర్భజన్ సింగ్ 265 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లుగా ఉన్నారు. ఇప్పుడు అశ్విన్ 250 వికెట్లతో వారిసరసన చోటు సంపాదించగలిగాడు.

మురళీధరన్ టాప్…

స్వదేశీగడ్డపై అత్యంత వేగంగా 250 వికెట్లు సాధించిన రికార్డు…శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరుతో ఉంది. మురళీధరన్ 42 టెస్టులు, 72 ఇన్నింగ్స్ లోనే 250 వికెట్లు సాధించాడు.

అశ్విన్ మాత్రం 42 టెస్టులు 81 ఇన్నింగ్స్ లో 250వ వికెట్ సాధించడం ద్వారా మురళీధరన్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

అనీల్ కుంబ్లే 43, రంగన్ హెరాత్ 44, డేల్ స్టెయిన్ 49, హర్భజన్ సింగ్ 51 టెస్టుల్లో 250 స్వదేశీ వికెట్ల రికార్డును అందుకోలేకపోయారు.

నాలుగో స్థానంలో అశ్విన్..

టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత నాలుగో బౌలర్ గా అశ్విన్ కొనసాగుతున్నాడు. లెగ్ స్పిన్నర్ అనీల్ కుంబ్లే 619, ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ 434 వికెట్లు, హర్భజన్ సింగ్ 417 వికెట్లతో మొదటి మూడు స్థానాలలో నిలిస్తే …ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ 311 వికెట్లతో 5వ భారత అత్యుత్తమ బౌలర్ గా రికార్డుల్లో నిలిచాడు.

First Published:  14 Nov 2019 11:11 PM GMT
Next Story