ప్రతి రోజూ పండగే మూవీ అప్ డేట్స్

సాయితేజ్, మారుతి కాంబోలో వస్తున్న సినిమా ప్రతిరోజూ పండగే. కంప్లీట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఒక్క పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ పాటను అందమైన లొకేషన్ లో చిత్రీకరించనున్నారు.

నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2, యూవీ పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న థియేటర్లలోకి రాబోతోంది. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇటీవలే కొన్ని కీలక సన్నివేశాల్ని అమెరికాలో షూట్ చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు… ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. దర్శకుడు మారుతి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.