Telugu Global
NEWS

రాహుల్ ద్రావిడ్ కు క్లీన్ చిట్

పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణల నుంచి విముక్తి భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడెమీ చైర్మన్ రాహుల్ ద్రావిడ్ కు…బీసీసీఐ ఎథిక్స్ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా ద్రావిడ్ ఏకకాలంలో రెండు రకాల పోస్టుల్లో కొనసాగుతూ… పరస్పర విరుద్ధ ప్రయోజనం పొందుతున్నారంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం జీవితకాల సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేయడంతో… ఎథిక్స్ కమిటీ సభ్యుడు జస్టిస్ డీకె జైన్ విచారణ చేపట్టి..ద్రావిడ్ కు […]

రాహుల్ ద్రావిడ్ కు క్లీన్ చిట్
X
  • పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణల నుంచి విముక్తి

భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడెమీ చైర్మన్ రాహుల్ ద్రావిడ్ కు…బీసీసీఐ ఎథిక్స్ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా ద్రావిడ్ ఏకకాలంలో రెండు రకాల పోస్టుల్లో కొనసాగుతూ… పరస్పర విరుద్ధ ప్రయోజనం పొందుతున్నారంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం జీవితకాల సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేయడంతో… ఎథిక్స్ కమిటీ సభ్యుడు జస్టిస్ డీకె జైన్ విచారణ చేపట్టి..ద్రావిడ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు.

ఇండియా సిమెంట్స్ సంస్థలో ఉద్యోగిగా ఉంటూ జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ గా ద్రావిడ్ జంట విధులు నిర్వర్తిస్తూ..అనుచిత లబ్ది పొందుతున్నారంటూ వచ్చిన ఆరోపణల్లో నిజంలేదని జస్టిస్ జైన్ తేల్చి చెప్పారు.

రాహుల్ ద్రావిడ్ నిరభ్యంతరంగా జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ గా విధులు నిర్వర్తించవచ్చునని ప్రకటించారు.

First Published:  15 Nov 2019 12:48 AM GMT
Next Story