ఎన్టీఆర్ తో ఆ సినిమా ఇప్పట్లో లేనట్టే!

ఎన్టీఆర్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అట్లీ కూడా కన్ ఫర్మ్ చేశాడు. అటు మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా ఉంటుందని స్పష్టంచేసింది. కానీ అంతలోనే ఈక్వేషన్లు మారిపోయాయి. లెక్కలు తారుమారయ్యాయి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ తో అట్లీ సినిమా చేయడం లేదు, భవిష్యత్తులో చేస్తాడో లేదో తెలీదు.

దీనికి కారణం అట్లీకి బంపర్ ఆఫర్ తగలడమే. అవును.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు అట్లీ. అంతేకాదు.. షారూక్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఏకంగా 3 సినిమాల డీల్ అందుకున్నాడు. వచ్చే ఏడాది షారూక్ తో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది కూడా. షారూక్ తో డీల్ లాక్ అయినట్టు తాజాగా ప్రకటించాడు అట్లీ. అంతేకాదు, షారూక్ పుట్టినరోజు వేడుకలకు తన భార్యతో పాటు హాజరయ్యాడు.

అలా షారూక్ రంగంలోకి దిగడంలో ఎన్టీఆర్-అట్లీ సినిమా పక్కకు జరిగింది. ప్రస్తుతం ఆర్-ఆర్-ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ లేదా కొరటాల శివతో ఓ సినిమా చేస్తాడు. వీళ్లిద్దర్లో ఎవరు ముందుగా అందుబాటులోకి వస్తారనేది అప్పుడే చెప్పలేం.