Telugu Global
NEWS

150 కోట్ల డీల్ సెటిల్ మెంట్ కోస‌మే ఆ పార్టీ అధ్య‌క్షుడు ఢిల్లీ వెళ్లారా?

ఏపీలో త్వ‌ర‌లోనే పెద్ద ఎత్తున ఆదాయ‌పు ప‌న్ను శాఖ దాడులు జ‌ర‌గబోతున్నాయి. ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన సోదాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క నేత 150 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు తీసుకున్న‌ట్లు ఐటీ విభాగం గుర్తించింది. ఇందుకు ఆధారాలు కూడా సేక‌రించింది. ఆ వ్య‌క్తితో న‌గ‌దు లావాదేవీలు జ‌రిగిన విష‌యాన్నిగుర్తించిన ఐటీ శాఖ ఈనెల 11న ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. దీంతో ఆ నేత‌ను త్వ‌ర‌లోనే విచారించబోతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ప్ర‌భుత్వ హాయాంలో అమ‌రావ‌తిలో […]

150 కోట్ల డీల్ సెటిల్ మెంట్ కోస‌మే ఆ పార్టీ అధ్య‌క్షుడు ఢిల్లీ వెళ్లారా?
X

ఏపీలో త్వ‌ర‌లోనే పెద్ద ఎత్తున ఆదాయ‌పు ప‌న్ను శాఖ దాడులు జ‌ర‌గబోతున్నాయి. ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన సోదాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క నేత 150 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు తీసుకున్న‌ట్లు ఐటీ విభాగం గుర్తించింది. ఇందుకు ఆధారాలు కూడా సేక‌రించింది.

ఆ వ్య‌క్తితో న‌గ‌దు లావాదేవీలు జ‌రిగిన విష‌యాన్నిగుర్తించిన ఐటీ శాఖ ఈనెల 11న ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. దీంతో ఆ నేత‌ను త్వ‌ర‌లోనే విచారించబోతున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌త ప్ర‌భుత్వ హాయాంలో అమ‌రావ‌తిలో 2652 కోట్ల‌కు సంబంధించిన ప‌నుల విష‌యంలో న‌గ‌దు చేతులు మారింది. అప్ప‌టి ముఖ్య‌నేత‌కు ఈ ప‌నులు చేసిన కంపెనీ సొమ్ము ఇచ్చిన‌ట్లు ఐటీశాఖ‌కు ఆధారాలు దొరికాయి.

ముంబైకి చెందిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కంపెనీ నుంచి డైరెక్టుగా ఆ పెద్ద‌నేత‌కు డబ్బు చేరిన‌ట్లు ఐటీసంస్థ దర్యాప్తులో నిర్దార‌ణ అయింది. అమరావతి సిఆర్డీఏ పరిధిలో నిర్మాణ పనులకు ఎంపిక చేసిన మూడు సంస్థలలో ఈ ప్రముఖ కంపెనీ ఉంది. తాత్కాలిక సచివాలయాల నిర్మాణం చేసిన కంపెనీ. వివిధ వర్గాల వారికి 2652 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన గృహాల సముదాయ నిర్మాణ పనుల్లో మేజర్ కాంట్రాక్ట్ ఈ సంస్థకు అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఈ కంపెనీకి టెండ‌ర్ ద‌క్క‌డం వెనుక ఆ కీల‌క నేత హ‌స్తం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు ప్ర‌తిఫ‌లంగా 20 శాతం చొప్పున ముడుపులు ముట్ట‌చెప్పేవిధంగా ఒప్పందం కుదిరిద‌ట‌. మొత్తం 700 కోట్లు చెల్లించేలా మాట్లాడుకున్నార‌ట‌. ఇందులో భాగంగా తొలిద‌శ‌లో 150 కోట్ల రూపాయ‌లు అధికారికంగా చేతులు మారిన‌ట్లు ఐటీ సోదాల్లో స్ప‌ష్టంగా బ‌య‌ట‌ప‌డింద‌ట‌.

రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ లో అప్పటి సచివాలయంలో భవన నిర్మాణ పనులను నాటి ముఖ్యమంత్రి ఇదే సంస్థకు అప్పగించిన విషయం వివాదాస్పదమైంది. బీజెపి అధినాయకత్వం చేతుల్లో ఇప్పుడు ఆ పెద్ద నాయకుడి ఆయువుపట్టు ఉంద‌ట‌. దీంతో బీజేపీతో పొత్తుకు ఈ పెద్ద నేత త‌హ‌త‌హ లాడుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌మ‌లంతో రాజీ ఒప్పందం కోసం, పార్టీ మారిన నలుగురు ఎంపీలతో పాటు ఓ పార్టీ అధ్యక్షుడిని ఢిల్లీ కి పంపించారని అంటున్నారు.

ప్రతి చిన్న విషయాన్ని గగ్గోలు పెట్టి రాద్ధాంతం చేసే తెలుగుదేశం పార్టీతో పాటు జాతి మీడియా తేలుకుట్టిన దొంగల్లాగా నోరు మెదపకపోవడం పై అనుమానాలు క‌లుగుతున్నాయి.

First Published:  15 Nov 2019 11:40 PM GMT
Next Story